Modi in G20 Summit: ఉక్రెయిన్ యుద్ధంపై G20 సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు-need of the hour is to pm modi in address at g20 summit ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  'Need Of The Hour Is To..' : Pm Modi In Address At G20 Summit

Modi in G20 Summit: ఉక్రెయిన్ యుద్ధంపై G20 సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

HT Telugu Desk HT Telugu
Nov 15, 2022 05:14 PM IST

Modi in G20 Summit: జీ 20 సదస్సులో పాల్గొనేందుకు ఇండోనేషియాలోని బాలికి వెళ్లిన ప్రధాని, అక్కడ రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.

జీ 20 సదస్సులో ప్రధాని మోదీ
జీ 20 సదస్సులో ప్రధాని మోదీ

Modi in G20 Summit:రష్యా, ఉక్రెయిన్ సమస్యకు యుద్ధం పరిష్కారం కాదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించి, దౌత్య మార్గాల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు

Modi in G20 Summit: పలు ద్వైపాక్షక భేటీలు

జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షికక సమావేశాలను నిర్వహించనున్నారు. జీ 20 సదస్సులో పాల్గొనడం కోసం మంగళవారం బాలి చేరుకున్నారు ప్రధాని మోదీ. ఆయనకు ఇండోనేషియా ప్రెసిడెంట్ జోకో విడొడొ స్వాగతం పలికారు.

Modi in G20 Summit: ఉమ్మడి ప్రయత్నాలు

రష్యా, ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించడానికి జీ 20 సహా ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా కృషి చేయాలని జీ 20 సదస్సులో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. కాల్పుల విరమణ, దౌత్య మార్గాల ద్వారా పరిష్కారం దిశగా ప్రయత్నించాలని సభ్య దేశాలను కోరారు. ప్రపంచంలో శాంతి, సంయమనం, భద్రత నెలకొనేందుకు చర్యలు తీసుకోవాల్సిన సరైన సమయం ఇదేనని స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం బుద్దుడు, గాంధీజీ నడయాడిన నేలలో(భారత్)లో జరిగే జీ 20 సదస్సులో ప్రపంచ శాంతికి సంబంధించి బలమైన సందేశం ఇస్తామన్న విశ్వాసం తనకుందన్నారు.

Modi in G20 Summit: ఆహార సంక్షోభంపై..

కోవిడ్, ఆ తరువాత రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆహార సంక్షోభంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా సప్లై చైన లు నాశనమయ్యాయని, మెజారిటీ ప్రజలకు నిత్యావసరాలు కూడా అందడ లేదని, ముఖ్యంగా అన్ని దేశాల్లోని పేదలు అత్యంత దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార ఉత్పత్తులు అన్ని దేశాలకు అందేలా బలమైన సప్లై చైన్ ను రూపొందించాలన్నారు.

Modi in G20 Summit: ఐరాసపై..

ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించే బృహత్తర బాధ్యత ప్రస్తుతం జీ20 సభ్య దేశాలపై ఉందని మోదీ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ బాధ్యతలను నిర్వహించాల్సిన ఐక్య రాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ విషయంలో విఫలమవుతున్నాయని మోదీ వ్యాఖ్యానించారు.

Modi in G20 Summit: సిరి ధ్యాన్యాలపై…

ప్రపంచం, ముఖ్యంగా పేద దేశాలు ఎదుర్కొంటున్న ఆహార సంక్షోభాన్ని నివారించే శక్తి చిరుధాన్యాలకు ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఆకలి, పౌష్టికాహార లోపం తదితర సమస్యలను ఇవి పరిష్కరించగలవని వెల్లడించారు. వచ్చే సంవత్సరం అంతర్జాతీయ చిరు ధాన్య దినోత్సవాన్ని అన్ని దేశాలు ఉత్సాహంగా నిర్వహించాలని కోరారు. వచ్చే సంవత్సరం జీ 20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించబోతున్నమని, అన్ని దేశాలకు ఆర్థిక సహకారం, టెక్నాలజీ బదిలీ తదితర విషయాలపై ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకువచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

IPL_Entry_Point

టాపిక్