ండోమ్‌లను 200 సంవత్సరాల క్రితం లేదా అంతకు ముందు ఉపయోగించారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. నెదర్లాండ్స్ పశ్చిమ భాగంలోని నార్త్ హాలండ్ ప్రావిన్స్‌లో ఆమ్ స్టర్ డామ్‌లోని రిక్స్ మ్యూజియంలో 1830 నాటి ప్రింటెడ్ కండోమ్‌ను పెట్టారు. దీనిని చూసేందుకు సందర్శకులు ఆసక్తిగా ఉన్నారు. 200 ఏళ్ల నాటి ఈ కండోమ్ కథ తెలుసుకోవాలని జనాలు అనుకుంటున్నారు.
ఈ కండోమ్ ఒక గది నుండి కనుగొన్నారు. గొర్రెల పేగు నుంచి దీన్ని తయారు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇన్నేళ్లు గడిచినా అది తగ్గలేదు. గత ఏడాది నెదర్లాండ్స్ లోని హార్లెమ్ లో జరిగిన వేలంలో ఈ కండోమ్ ను 1,000 యూరోలకు కొనుగోలు చేశారు. 19 వ శతాబ్దంలో వ్యభిచారం, లైంగికత గురించి చెప్పడానికి మ్యూజియం ప్రదర్శనలో పెట్టారు.
ఈ కండోమ్ ను పరిశీలించగా అది ఎప్పుడూ వాడలేదని తేలింది. ఈ కండోమ్‌ను లైంగిక సుఖం కోసం, అవాంఛిత గర్భం నుంచి బయటపడటానికి ఉపయోగించడానికి తయారు చేశారని నిపుణులు చెబుతున్నారు. కొన్ని నగరాల్లో ఆసమయంలో వ్యభిచారం జోరుగా సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కండోమ్ ను ఆ సమయంలో కస్టమర్లు కొనేవారు.
కండోమ్ అందుకున్న తర్వాత దానిని అతినీలలోహిత కాంతి కింద పరిశీలించగా, దానిని ఎప్పుడూ ఉపయోగించలేదని తేలిందని మ్యూజియం క్యూరేటర్ జాయిస్ జెలెన్ చెప్పారు. 'ప్రింటెడ్ కండోమ్ ఉన్న ఏకైక ఆర్ట్ మ్యూజియం మా వద్ద ఉందని చెప్పుకోవడానికి మేం గర్విస్తున్నాం. దీనిని ఇతర మ్యూజియంలకు అప్పుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ కండోమ్ చాలా పెళుసుగా ఉంటుంది. ఇది నవంబర్ చివరి వరకు మాత్రమే ప్రదర్శనలో ఉంటుంది.'అని జెలెన్ అన్నారు.
ఈ కండోమ్ గురించి మరో ప్రత్యేకత ఏమిటంటే దానిపై ఒక చిత్రం ముద్రించి ఉంది. ఇందులో ముగ్గురు అర్ధనగ్నంగా నిలబడి ఉన్నారు. ఈ కండోమ్‌పై చిత్రం గ్రీకు పురాణం నుండి ప్రేరణ పొందిందని అంటున్నారు. ఇందులో ట్రోజన్ రాకుమారుడు ముగ్గురు అందమైన అమ్మాయిలలో ఒకరిని ఎంచుకుంటాడని చెబుతున్నారు. 19 వ శతాబ్దంలో కండోమ్‌లను చాలా చెడ్డవిగా భావించేవారు. అందుకే కొందరు వీటిని రహస్యంగా ఉపయోగించారు. ఈ కండోమ్ పొడవు సుమారు 20 సెంటీమీటర్లు.