Pakistan Floods: పాక్ లో వరదల విలయం - 1300 మంది మృతి-nearly 1 300 people die due to devastating floods in pakistan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Nearly 1,300 People Die Due To Devastating Floods In Pakistan

Pakistan Floods: పాక్ లో వరదల విలయం - 1300 మంది మృతి

HT Telugu Desk HT Telugu
Sep 04, 2022 10:39 AM IST

Pakistan Floods: పాకిస్థాన్​లో భారీ వర్షాలు, వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 1300కుపైగా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

పాకిస్థాన్ లో వరదలు - భారీగా వరద నష్టం
పాకిస్థాన్ లో వరదలు - భారీగా వరద నష్టం (REUTERS)

devastating floods in Pakistan: భారీ వరదలు పాకిస్థాన్ ను అల్లకల్లోలం చేస్తున్నాయి. భారీ వర్షాల దాటికి ఇప్పటివరకు 1300 మంది మృతి చెందినట్లు ఆ దేశ విపత్తుల నిర్వహణ విభాగం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. సహాయక చర్యలను ముమ్మరం చేసింది పాక్ సర్కార్. మరోవైపు ఎన్జీవో సంస్థలు ఈ ఆపరేషన్లలో పాల్గొంటున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

దక్షిణ పాక్ ప్రాంతంలో వర్షాలు, వరదల తీవ్రత ఎక్కువగా ఉంది. ఫలితంగా బలూచిస్థాన్, ఖైబర్ పాక్తున్వాకా, సింధ్ ప్రాంతాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. భారీ వరదల దాటికి 1,468,019 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. లక్షలమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Floods in Pakisthan 2022: ప్రాథమిక అంచనాల ప్రకారం 10 బిలియన్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి సర్వేలు చేపడుతున్నారు. 723,919 కుటుంబాలకు 18.25 బిలియన్ రూపాయలను పంపిణీ చేసినట్లు పాకిస్థాన్ అధికారులు వెల్లడించారు.

బలూచిస్థాన్, సింధ్, పంజాబ్ ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసిన రిలీఫ్ క్యాంప్ లకు 500,000 మందికిపైగా తరలించారు. వరదల దాటికి భారీగా నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు.

IPL_Entry_Point