NCL Recruitment 2023: బొగ్గు గనుల్లో ఉద్యోగం; 10వ తరగతి అర్హత; అప్లై చేయండిలా..
NCL Recruitment 2023: ప్రభుత్వ రంగ సంస్థ నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో ట్రైనీ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ nclcil.in. ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 338 ట్రైనీ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు.

NCL Recruitment 2023: ప్రభుత్వ రంగ సంస్థ నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (Northern Coalfields Limited NCL) లో ట్రైనీ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ nclcil.in. ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 338 ట్రైనీ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు.
Vacancy Details: వేకెన్సీ వివరాలు.. అర్హతలు
మొత్తం 338 ట్రైనీ పోస్ట్ లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ ఆగస్ట్ 31. వేకెన్సీ వివరాలు ఇలా ఉన్నాయి..
- షోవెల్ ఆపరేటర్ - 35 పోస్ట్ లు
- డంపర్ ఆపరేటర్ - 221 పోస్ట్ లు
- సర్ఫేస్ మైనర్ ఆపరేటర్ - 25 పోస్ట్ లు
- డోజర్ ఆపరేటర్ - 37 పోస్ట్ లు
- గ్రేడర్ ఆపరేటర్ - 6 పోస్ట్ లు
- పే లోడర్ ఆపరేటర్ - 2 పోస్ట్ లు
- క్రేన్ ఆపరేటర్ - 12 పోస్ట్ లు
Eligibility Criteria: విద్యార్హతలు..
ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి ఆఖరు తేదీ ఆగస్ట్ 31. అభ్యర్థులు కనీసం గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాస్ అయి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు రూ. 1000 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. రూ. 180 జీఎస్టీ అదనం. అంటే మొత్తం 1180 రూపాయలను పరీక్ష ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం డిపార్ట్మెంట్ అభ్యర్థులు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.