NTET 2024: నేషనల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 ఆన్సర్ కీ విడుదల; ఇక్కడ, ఇలా చెక్ చేసుకోండి..
NTET 2024: నేషనల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆన్సర్ కీ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) శనివారం విడుదల చేసింది. ఆ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఆన్సర్ కీ లను ఎన్ టెట్ అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in/NTET/ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
NTET 2024: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేషనల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 లేదా ఎన్ టెట్ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీని శనివారం విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఆన్సర్ కీలను exams.nta.ac.in/NTET/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నవంబర్ 19న పరీక్ష, 23న ఫలితాలు
నవంబర్ 19న దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (cbt) విధానంలో నేషనల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 పరీక్ష నిర్వహించారు. నవంబర్ 23వ తేదీన ఆన్సర్ కీని విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఆన్సర్ కీతో పాటు ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా ఎన్టీఏ విడుదల చేసింది.
అభ్యంతరాలు తెలపవచ్చు..
ప్రతి ప్రశ్నకు రూ .200 చెల్లించి ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలను లేవనెత్తడానికి అభ్యర్థులకు అనుమతి ఉందని ఎన్టీఏ తెలిపింది. నవంబర్ 23 నుంచి నవంబర్ 25 రాత్రి 11 గంటల వరకు అభ్యర్థులు తమ అభ్యంతరాలను వెల్లడించవచ్చని వెల్లడించింది. ప్రాసెసింగ్ ఫీజును డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్/ యూపీఐ ద్వారా 25 నవంబర్ 2024 వరకు (రాత్రి 11:00 గంటల వరకు) చెల్లించవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించకుండా ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించరు. అలాగే, ఆన్సర్ కీ పై అభ్యంతరాలను మరే ఇతర మాధ్యమం ద్వారా కూడా అంగీకరించబోమని అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అభ్యర్థులు చేసే సవాళ్లను సబ్జెక్టు నిపుణుల బృందం పరిశీలిస్తుంది. ఒకవేళ చెల్లుబాటు అవుతుందని తేలితే దానికి అనుగుణంగా ఆన్సర్ కీని సవరించి, ఫైనల్ ఆన్సర్ కీ ని రూపొందిస్తారు. ఆ ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఎన్టీఈటీ 2024 ఫలితాలను ప్రకటిస్తారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే 011- 40759000 నంబర్ ను సంప్రదించవచ్చు లేదా ntet@nta.ac.in లో ఇమెయిల్ చేయవచ్చు.
ఎన్టీఈటీ ఆన్సర్ కీని ఇలా చెక్ చేసుకోండి
- ముందుగా exams.nta.ac.in కు వెళ్లండి
- ఎన్టీఈటీ ఎగ్జామ్ ట్యాబ్ ఓపెన్ చేయండి.
- ప్రొవిజనల్ ఆన్సర్ కీ లింక్ ఓపెన్ చేయండి.
- మీ అప్లికేషన్ నెంబరు మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి.
- ఆన్సర్ కీని చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి.