‘‘నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు రూ.142 కోట్ల అనుచిత లబ్ధి’’: ఢిల్లీ కోర్టుకు తెలిపిన ఈడీ-national herald sonia gandhi rahul gandhi got 142 crore rupees as proceeds of crime says ed ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘‘నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు రూ.142 కోట్ల అనుచిత లబ్ధి’’: ఢిల్లీ కోర్టుకు తెలిపిన ఈడీ

‘‘నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు రూ.142 కోట్ల అనుచిత లబ్ధి’’: ఢిల్లీ కోర్టుకు తెలిపిన ఈడీ

Sudarshan V HT Telugu

బ్రేకింగ్: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు రూ. 142 కోట్ల మేర అనుచిత లబ్ధి చేకూరిందని ఈడీ ఆరోపించింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టుకు వివరాలను అందించింది.

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ (PTI)

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు అవినీతికి పాల్పడినట్లు ప్రాథమిక క ఆధారాలున్నాయని ఢిల్లీ కోర్టుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. తల్లీకొడుకులిద్దరూ రూ.142 కోట్ల మేర అనుచిత లబ్ధి పొందారని కోర్టుకు తెలిపింది.

ఈడీ వాదనలు

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ గాంధీలు రూ.142 కోట్లు పొందారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఢిల్లీ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లు 1, 2 నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో సమర్పించిన చార్జిషీట్ పై ఈడీ ప్రాథమిక వాదనలు వినిపిస్తోంది. ఈ కేసులో ఇటీవల చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ ప్రస్తుతం ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే ముందు తన ప్రాథమిక వాదనలు వినిపిస్తోంది. గాంధీలు, ఇతర నిందితులపై మనీలాండరింగ్ కేసు నమోదైందని ఏఎస్జీ రాజు తెలిపారు.

సుబ్రమణ్యస్వామి ప్రైవేట్ ఫిర్యాదు

2014 జూన్ 26న బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ప్రైవేట్ ఫిర్యాదు చేసిన తర్వాత మొదలైన సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఈ చర్యలు చేపట్టింది. స్వామి ఆరోపణలను మేజిస్ట్రేట్ కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత 2021లో ఈడీ అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది. బుధవారం నాటి విచారణలో న్యాయమూర్తి గోగ్నే ఈ కేసులో కీలక ఫిర్యాదుదారుగా ఉన్న సుబ్రమణ్య స్వామికి చార్జిషీట్ కాపీని అందజేయాలని ఈడీని ఆదేశించారు. మరోవైపు ఈడీ ఆరోపణలకు ప్రతిస్పందనగా తమ వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని సోనియా, రాహుల్ గాంధీల న్యాయ ప్రతినిధులు కోర్టును కోరారు.

మే 2న నోటీసులు

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ కోర్టు మే 2వ తేదీన నోటీసులు జారీ చేసింది. ఛార్జిషీట్ విచారణ సమయంలో వారి వాదనలు వినిపించే హక్కు ఉందని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే తెలిపారు. ఏ దశలోనైనా విచారణ జరిపే హక్కు న్యాయమైన విచారణకు జీవం పోస్తుందన్నారు. కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్ లు యంగ్ ఇండియాలో 38 శాతం వాటాలు కలిగి ఉన్నారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.