NEET PG : ‘నిస్సహాయ స్థితిలో మోదీ’- ప్రధానిపై రాహుల్​ గాంధీ ఫైర్​..-narendra modi completely helpless rahul gandhi attacks centre over neetpg ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Pg : ‘నిస్సహాయ స్థితిలో మోదీ’- ప్రధానిపై రాహుల్​ గాంధీ ఫైర్​..

NEET PG : ‘నిస్సహాయ స్థితిలో మోదీ’- ప్రధానిపై రాహుల్​ గాంధీ ఫైర్​..

Sharath Chitturi HT Telugu
Jun 23, 2024 10:38 AM IST

Rahul Gandhi attacks Centre : నీట్​ పీజీ వాయిదా నేపథ్యంలో కేంద్రంపై, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాహుల్​ గాంధీ. దేశ భవిష్యత్తును కాపాడాలన్నారు.

రాహుల్​ గాంధీ..
రాహుల్​ గాంధీ..

NEET PG postponed : నీట్​ పీజీ 2024 వాయిదా పడిన నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. పేపర్​ లీక్​ రాకెట్​, ఎడ్జ్యుకేషన్​ మాఫియా ముందు.. మోదీ నిస్సహాయ స్థితిలో నిలబడ్డారని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బీజేపీ ప్రభుత్వం చాలా ప్రమాదకరం అన్నారు.

"ఇప్పుడు నీట్​ పీజీ పరీక్ష వాయిదా పడింది! నరేంద్ర మోదీ పాలనలో విద్యా వ్యవస్థ ఎలా నాశనం అయ్యిందో చెప్పేందుకు ఇది మరొక ఉదాహరణ," అని ఎక్స్​లో ట్వీట్​ చేశారు రాహుల్​ గాంధీ.

"ఏం జరిగినా నిశ్సబ్దంగా చూస్తూ ఉండిపోతరు మోదీ. ఇప్పుడు.. పేపర్​ లీక్​ రాకెట్​, ఎడ్జ్యుకేషన్​ మాఫియా ముందు నిస్సహాయంగా ఉండిపోయారని స్పష్టమైంది. ఆయన ప్రభుత్వం.. విద్యార్థుల భవిష్యత్తుకు పెను ప్రమాదం. దేశ భవిష్యత్తును మనం రక్షించాలి," అని రాహుల్​ గాంధీ అన్నారు.

Rahul Gandhi on NEET PG : ఆదివారం జరగాల్సిన నేషనల్​ ఎలిజిబులిటీ కమ్​ ఎంట్రెన్స్​ టెస్ట్ నీట్​​ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు శనివారం రాత్రి ఓ ప్రకటన ద్వారా తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

"తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని.. పోటీ పరీక్షల సమగ్రతను కాపాడేందుకు, నీట్​ పీజీని పూర్తిస్థాయిలో అసెస్​ చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అంందుకే.. పరీక్షను వాయిదా వేస్తున్నాము," అని సంబంధిత ప్రకటన వెల్లడించింది.

నీట్​ యూజీ 2024 చుట్టూ తీవ్ర స్థాయిలో వివాదం నెలకొంది. అంతేకాదు.. యూజీసీ-నెట్ పరీక్ష ప్రశ్నాపత్రం డార్క్ నెట్, టెలిగ్రామ్ లలో చలామణి అయినట్లు తేలడంతో ప్రభుత్వం దానిని గత వారం రద్దు చేసింది.

నీట్‌లో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు..

NEET UG paper leak : నీట్​ యూజీ 2024పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో అవకతవకలపై విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ) చీఫ్‌ను తొలగించడం, సంస్థ పనితీరును సమీక్షించడానికి ఒక ప్యానెల్ ఏర్పాటు చేయడం, నీట్-యూజీ అవకతవకలపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించడం వంటి పలు నిర్ణయాలను శనివారం ప్రకటించింది.

అంతేకాదు.. పేపర్​ లీక్​కు సంబంధించి ఒక కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. శుక్రవారం అమల్లోకి వచ్చిన ఈ పబ్లిక్​ ఎగ్జామినేషన్​ (ప్రివెన్షన్​ ఆఫ్​ అన్​ఫెయిర్​ మీన్స్​) యాక్ట్​ 2024 ప్రకారం.. పేపర్​ లీక్​లకు బాధ్యులుగా తేలినా, ఆన్సర్​ షీట్​ని టాంపర్​ చేశారని రుజువైనా.. సంబంధిత వారిపై 3ఏళ్ల శిక్ష పడుతుంది. తీవ్రత బట్టి దీనిని 5ఏళ్ల వరకు పొడగించవచ్చు. పైగా.. ఇవన్నీ నాన్​-బెయిలెబుల్​ నేరాలుగా పరిగణిస్తారు.

పేపర్​ లీక్​ వ్యవహారం తెలిసినా, అధికారులకు సమాచారం ఇవ్వన్ని ఎగ్జామినేషన్​ సర్వీస్​ ప్రొవైడర్లకు.. తాజా చట్టం ప్రకారం రూ. 1 కోటి వరకు జరిమానా పడుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం