Man barks like dog : రేషన్​ కార్డులో 'కుక్క' పేరు.. బౌ బౌ అంటూ నిరసన!-name in ration card spelt kutta man barks like dog in protest video goes viral ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Name In Ration Card Spelt "Kutta", Man Barks Like Dog In Protest Video Goes Viral

Man barks like dog : రేషన్​ కార్డులో 'కుక్క' పేరు.. బౌ బౌ అంటూ నిరసన!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 20, 2022 07:25 AM IST

Man Barks Like Dog in front of government official : రేషన్​ కార్డులో తప్పు పేరు పడటంతో ఓ వ్యక్తికి చిర్రెత్తుకొచ్చింది. దత్తా బదులుగా కుత్తా(కుక్క) పేరు చూసి కోపం తెచ్చుకున్నాడు. ప్రభుత్వ అధికారి ముందు బౌ బౌ అంటూ.. నిరసన తెలిపాడు. ఈ ఘటన పశ్చిమ్​ బెంగాల్​లో జరిగింది.

ప్రభుత్వ అధికారి వద్ద నిరసన తెలుపుతున్న శ్రీకాంత్​
ప్రభుత్వ అధికారి వద్ద నిరసన తెలుపుతున్న శ్రీకాంత్​ (ANI)

Man Barks Like Dog in front of government official : ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంఘటనలు నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉంటాయి. తప్పు ఎవరు చేసినా.. రోజులు, నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ బాధితులు తిరగాల్సిందే. ఇంత చేసినా ఒక్కోసారి ఫలితం దక్కదు. పశ్చిమ్​ బెంగాల్​కు చెందిన శ్రీకాంత్​ దత్తా విషయంలోనూ ఇదే జరిగింది. ఇక సహనాన్ని కోల్పోయిన అతడు.. ఓ ప్రభుత్వ అధికారి ముందు వినూత్నంగా నిరసన చేపట్టారు. కుక్కలాగా అరుస్తూ ఆందోళన చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ట్రెండింగ్ వార్తలు

రేషన్​ కార్డులో తప్పు పేరు..

శ్రీకాంత్​ కుమార్​ దత్తా.. బంకుర ప్రాంతంలో నివాసముంటున్నాడు. కాగా.. రేషన్​ కార్డులో అతని పేరు తప్పుగా పడింది. శ్రీకాంత్​ కుమార్​ దత్తా బదులుగా.. శ్రీకాంతి​ కుమార్​ కుత్తా అని రేషన్​ కార్డులో ప్రింట్​ అయ్యింది. కుత్తా అంటే హిందీలో కుక్క అని అర్థం వస్తుంది.

Man Barks Like Dog viral video : రేషన్​ కార్డులో శ్రీకాంత్​ పేరు తప్పుగా రావడం ఇది మూడోసారి. ప్రతీసారి ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంది.

"మొదటిసారి నా పేరు శ్రీకాంత్​ మొండల్​ అని రాశారు. నేను మొండల్​ కాదు. దురేయ్​ సర్కార్(ఇంటి ముందుకే ప్రభుత్వం) క్యాంప్​​ వద్దకు వెళ్లి అభ్యర్థన పెట్టుకున్నా. ఆ తర్వాత నా పేరును శ్రీకాంతో దత్తా అయ్యింది. మళ్లీ ప్రభుత్వ అధికారులను సంప్రదించాను. ఈ నెల 11న మరోమారు అప్లై చేసుకున్నాను. ఈసారి నా పేరు శ్రీకాంతి కుమార్​ కుత్తా అని పడింది. ఇది చూశాక నేను మెంటల్​గా చాలా మనోవేదనకు గురయ్యాను. మళ్లీ దురేయ్​ సర్కార్​ క్యాంప్​నకు వెళ్లాను. అక్కడ ఓ సీనియర్​ అధికారితో మాట్లాడాను. ఫలితం దక్కలేదు," అని శ్రీకాంత్​ దత్తా వెల్లడించారు.

ఈ క్రమంలోనే.. ఓ ప్రభుత్వ అధికారిని రోడ్డు మీద అడ్డగించాడు శ్రీకాంత్​. అధికారి కారును ఆపి.. కుక్కలాగా బౌ బౌ అంటూ, తన రేషన్​ కార్డు పత్రాలను చూపిస్తూ నిరసన తెలిపాడు. ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Srikanth Kumar Dutta viral video : ఈ వినూత్న నిరసన తర్వాత.. రేషన్​ కార్డులో పేరు మార్చే విషయాన్ని ప్రభుత్వ అధికారులు కాస్త సీరియస్​గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. రెండు రోజుల్లో శ్రీకాంత్​ పేరు సరిచేస్తామని అతనికి హామీనిచ్చారు.

"బీడీఓ(బ్లాక్​ డెవలప్​మెంట్​ ఆఫీసర్​)కు నా రేషన్​ కార్డు ఇచ్చాను. పేరు ఏం ఉందో చదవమన్నాను. ఆయన చదవలేదు. అక్కడి నుంచి పారిపోయారు. ఏం తప్పుచేశారని పారిపోయారు? సాధారణ పౌరులను ఇంకెంత కాలం ఇలా ఇబ్బంది పెడతారు?" అని మండిపడ్డాడు శ్రీకాంత్​.

WhatsApp channel

సంబంధిత కథనం