Teen gives birth to baby : 15ఏళ్లకే తల్లి అయిన మైనర్.. ఆన్లైన్లో వీడియోలు చూసి సొంతంగా డెలివరీ!
Nagpur teen gives birth to baby : ఓ బాలిక 15ఏళ్లకే తల్లి అయ్యింది. ఆ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. చివరికి.. యూట్యూబ్‌లో వీడియోలు చూసి సొంతంగా డెలివరీ చేసుకుంది. ఆ వెంటనే.. ఆ పసికందును చంపేసింది. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో కలకలం సృష్టించింది.
Nagpur teen gives birth to baby : మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 15ఏళ్లకే తల్లి అయిన ఓ బాలిక.. ఆన్లైన్లో వీడియోలు చూసి ఇంట్లోనే సొంతంగా డెలివరీ చేసుకుంది. చివరికి.. భూమి మీదకు అడుగుపెట్టిన కొన్ని క్షణాల్లోనే ఆ పసికందును చంపేసింది!
ఆన్లైన్లో వీడియోలు చూసి..
మహరాష్ట్ర నాగ్‌పూర్‌లోని అంబాజారీ ప్రాంతంలో నివాసముంటున్న ఓ 15ఏళ్ల బాలికకు.. కొంత కాలం క్రితం సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. కాగా అతను ఆమెను లైంగికంగా వేధించాడు. ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం ఆ బాలిక ఎప్పుడూ ఇంట్లో చెప్పలేదు. బిడ్డ పెరిగే కొద్ది, బాలిక శరీరంలో మార్పులు రావడం మొదలయ్యాయి. తనకు ఓంట్లో బాలేదని ఆ బాలిక, తన తల్లికి చెబుతూ వచ్చింది.
Maharashtra crime news : ఈ విషయాన్ని మరింత రహస్యంగా ఉంచేందుకు.. ఆ బాలిక సొంతంగా డెలివరీ చేసుకోవడం ఎలాగో నేర్చుకుంది! యూట్యూబ్‌తో పాటు ఆన్లైన్లో అనేక వీడియోలు చూసింది. చివరికి మార్చ్ 2న.. తన ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. కాగా పుట్టిన వెంటనే ఆ పసికందు గొంతు నులిమి చంపేసింది ఆ బాలిక. మృతదేహాన్ని ఓ బాక్స్‌లో పెట్టి.. సమయం చూసుకుని బయట పడేద్దామని భావించింది.
ఇలా బయటపడింది..
డెలివరీ కారణంగా బాలిక ఆరోగ్యం దెబ్బతింది. అదే సమయానికి ఆమె తల్లి కూడా ఇంటికి చేరుకుంది. ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నించింది. నొప్పి, బాధను ఇక భరించలేకపోయిన ఆ మైనర్.. చివరికి జరిగినది అంతా చెప్పింది. ఒక్కసారిగా ఆ తల్లి షాక్‌కు గురైంది. బాలికను, బిడ్డను ఆసుపత్రికి తరలించింది. పసికందు అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
Nagpur latest news : ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లారు. పసికందు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తిపై పోలీసులు పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత.. మైనర్‌పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసే యోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.