Man kills mother : తల్లిని చంపిన కుమారుడు- స్మార్ట్​ఫోన్​ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదని!-nagpur crime news man kills mother after she refuses to give him money for a smartphone ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Nagpur Crime News Man Kills Mother After She Refuses To Give Him Money For A Smartphone

Man kills mother : తల్లిని చంపిన కుమారుడు- స్మార్ట్​ఫోన్​ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదని!

Sharath Chitturi HT Telugu
Oct 21, 2023 07:20 AM IST

Crime news : స్మార్ట్​ఫోన్​ కొనివ్వడం లేదన్న కారణంతో ఓ వ్యక్తి, తన తల్లిని చంపేశాడు. అతని వయస్సు 28ఏళ్లు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

తల్లిని చంపిన కుమారుడు..
తల్లిని చంపిన కుమారుడు..

Maharashtra crime news : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్మార్ట్​ఫోన్​ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వడం లేదన్న కారణంతో.. ఓ వ్యక్తి, సొంత తల్లిని చంపేశాడు!

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

మహారాష్ట్ర నాగ్​పూర్​లో బుధవారం జరిగింది ఈ ఘటన. ఓ మహిళ.. తన ఇద్దరు కుమారులతో కలిసి ఓ ఇంట్లో జీవిస్తోంది. ఆమె పేరు కమ్లాబాయ్​ బద్వాక్​. ఆమె వయస్సు 47ఏళ్లు. పెద్ద కుమారుడి పేరు దీపక్​. చిన్న కుమారుడి పేరు రామ్​నాథ్​​. అతని వయస్సు 28ఏళ్లు.

కాగా.. దీపక్​కు స్మార్ట్​ఫోన్​ కొనుక్కోవాలని అనిపించింది. తల్లిని డబ్బులు అడిగాడు. ఆమె ఇవ్వలేదు. అతనికి కోపం వచ్చింది. మళ్లీ, మళ్లీ అడిగాడు. అయినప్పటికీ.. ఆ మహిళ, స్మార్ట్​ఫోన్​ కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వలేదు. ఆ వ్యక్తికి కోపం మరింత పెరిగింది.

ఈ నేపథ్యంలో.. చివరిగా.. బుధవారం నాడు.. స్మార్ట్​ఫోన్​ ప్రస్తావన తెచ్చాడు రామ్​నాథ్​. ఆమె మళ్లీ ఒప్పుకోలేదు. ఇక సొంత తల్లిని చంపాలని నిర్ణయించుకున్నాడు ఆ వ్యక్తి. గుడ్డలతో ఆమో గొంతును బిగించి.. ఊపిరి ఆడనివ్వకుండా చంపేశాడు! ఆ మహిళ.. విలవిలలాడుతు ప్రాణాలు విడిచింది.

Man kills mother : కొంతసేపటి తర్వాత.. దీపక్​కు ఫోన్​ చేసిన రామ్​నాథ్​.. తల్లికి ఒంట్లో బాలేదని, ఆసుపత్రికి తీసుకెళుతున్నట్టు చెప్పాడు. హాస్పిటల్​కు పరుగులు తీసిన దీపక్​.. తల్లి అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని తెలిసి కన్నీరు పెట్టుకున్నాడు. కానీ తల్లి మృతదేహాన్ని చూసిన అతనికి అనుమానాలు మొదలయ్యాయి. ఆమె శరీరంపై బంగారం ఆభరణాలు కనిపించడం లేదని గ్రహించాడు. సోదరుడిపై అనుమానం పెరిగింది. ఈ క్రమంలో పోలీసులను అప్రమత్తం చేశాడు.

ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. ఏం జరిగింది? అన్న విషయాన్ని దీపక్​ నుంచి అడిగి తెలుసుకున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత.. మహిళ మరణానికి అసలు కారణం బయటపడింది.

Man kills mother for smartphone : "దీపక్​ ఫిర్యాదుతో రామ్​నాథ్​ని విచారించాము. అతను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. స్మార్ట్​ఫోన్​ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతోనే.. సొంత తల్లిని చంపినట్టు అంగీకరించాడు," అని పోలీసులు వెల్లడించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 28ఏళ్ల రామ్​నాథ్​ని అరెస్ట్​ చేశారు. కేసులో దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్మార్ట్​ఫోన్​ కోసం ఓ వ్యక్తి, తన తల్లిని చంపేశాడన్న వార్త.. స్థానికులను షాక్​కు గురిచేసింది. అతడిని శిక్షించాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు. నిందితుడిపై చర్యలు చేపడతామని పోలీసులు హామీనిచ్చారు.

WhatsApp channel

సంబంధిత కథనం