Owaisi speaks | `ముస్లింలే ఎక్కువ‌గా గ‌ర్భ‌నిరోధ‌క సాధ‌నాలు వాడుతున్నారు`-muslims using most contraceptives says asaduddin owaisi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Muslims Using Most Contraceptives, Says Asaduddin Owaisi

Owaisi speaks | `ముస్లింలే ఎక్కువ‌గా గ‌ర్భ‌నిరోధ‌క సాధ‌నాలు వాడుతున్నారు`

HT Telugu Desk HT Telugu
Jul 12, 2022 07:14 PM IST

ముస్లింలే ఎక్కువ‌గా గ‌ర్భ‌నిరోధ‌క సాధ‌నాలు వాడుతున్నార‌ని హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జ‌నాభా అస‌మ‌తౌల్యం ఉంద‌ని ఉత్త‌ర ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ సోమ‌వారం చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో.. అస‌దుద్దీన్ ఓవైసీ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ
హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌నాభా అస‌మ‌తౌల్యం ఉంద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. దానిపై ఎంఐఎం చీఫ్, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు

Owaisi speaks | జ‌నాభా నియంత్ర‌ణ‌

జ‌నాభా అస‌మ‌తౌల్య‌త‌పై ఇటీవ‌ల యూపీలో చ‌ర్చ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ వ్యాఖ్య‌లు చేశారు. ``దేశంలో జ‌నాభా నియంత్ర‌ణకు ప్ర‌త్యేకంగా చ‌ట్టం అవ‌స‌రం లేద‌ని వారి(బీజేపీ) ఆరోగ్య శాఖ మంత్రే స్వ‌యంగా వ్యాఖ్యానించారు. ఫ‌ర్టిలిటీ రేటు 2016లో 2.6గా ఉంది. ఇప్పుడు అది 2.3కి త‌గ్గింది. అన్ని దేశాల్లోకి భార‌త్ లోనే జ‌నాభా నియంత్ర‌ణ స‌మ‌ర్ద‌వంతంగా ఉంది`` అని ఓవైసీ వ్యాఖ్యానించారు.

Owaisi speaks | యూఎన్ రిపోర్ట్‌

2023లో భార‌త్ మరో రికార్డు సృష్టించ‌నుంద‌ని ఐరాస ఇటీవ‌ల ప్ర‌క‌టించింది. జ‌న సంఖ్య‌లో భార‌త్ 2023వ సంవ‌త్స‌రంలో చైనాను అధిగ‌మించి, తొలి స్థానంలో నిల‌వ‌నుంద‌ని ఐక్య‌రాజ్య స‌మితి వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ``జ‌న నియంత్ర‌ణ కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగించాలి. అదే స‌మ‌యంలో జ‌నాభా అస‌మ‌తౌల్యం స‌మ‌స్య‌ను అధిగ‌మించాలి`` అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ``ఒక వ‌ర్గం జ‌నాభా అసంబ‌ద్ధంగా పెరుగుతున్న స‌మ‌యంలో, మూల నివాసుల జ‌నాభాను జ‌నాభా నియంత్ర‌ణ ప‌ద్ద‌తుల ద్వారా నియంత్రించ‌డం జ‌రుగుతోంది. దీనివ‌ల్ల జ‌నాభా అస‌మ‌తౌల్య‌త ఏర్ప‌డుతోంది. ఇలా ఒక వ‌ర్గం జ‌నాభా అసంబ‌ద్ధంగా పెర‌గ‌డాన్ని నియంత్రించాలి`` అని ఆదిత్య‌నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై అస‌దుద్దీన్ ఓవైసీ స్పందించారు. `ముస్లింలు ఈ దేశ మూల‌నివాసులు కారా?` అని ఆయ‌న ప్ర‌శ్నించారు. నిజానికి, ముస్లింలే ఎక్కువ‌గా గ‌ర్భ‌నిరోధ‌క సాధ‌నాలు వాడుతున్నార‌న్నారు. అలాగే, `భార‌తదేశ‌ మూల‌నివాసులు గిరిజ‌నులు, ద్ర‌విడ ప్ర‌జ‌లే` అని ఓవైసీ స్ప‌ష్టం చేశారు.

IPL_Entry_Point