'కండోమ్​లు ఎక్కువగా వాడుతున్నది ముస్లింలే.. జనాభా పెరగడం లేదు'-muslims use condoms the most population on decline says owaisi on rss chief s remarks ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Muslims Use Condoms The Most, Population On Decline, Says Owaisi On Rss Chief's Remarks

'కండోమ్​లు ఎక్కువగా వాడుతున్నది ముస్లింలే.. జనాభా పెరగడం లేదు'

Sharath Chitturi HT Telugu
Oct 09, 2022 01:56 PM IST

Owaisi on RSS Chief's remarks : ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నట్టు కనిపిస్తోంది. జనాభా నియంత్రణపై భగవత్​ చేసిన వ్యాఖ్యలను ఓవైసీ తిప్పికొట్టారు.

అసదుద్దీన్​ ఓవైసీ
అసదుద్దీన్​ ఓవైసీ (HT_PRINT/file)

Owaisi on RSS Chief's remarks : దేశంలో ముస్లింల జనాభా పెరగడం లేదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ తెలిపారు. ముస్లింలే కండోమ్​లను ఎక్కువగా వాడుతున్నారని అన్నారు. జనాభా నియంత్రణపై ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ చేసిన వ్యాఖ్యలను తిప్పి కొడుతూ ఈ మేరకు మాట్లాడారు ఓవైసీ.

ట్రెండింగ్ వార్తలు

"ముస్లింల జనాభా పెరగడం లేదు. తగ్గుతోంది. ముస్లిం పిల్లల మధ్య గ్యాప్​ కూడా పెరుగుతోంది. కండోమ్​లు ఎక్కువగా ఎవరు వాడుతున్నారు? ముస్లింలే. ఈ విషయంపై మోహన్​ భగవత్​ మాట్లాడటం లేదు," అని తాను చేసిన ట్వీట్​లో వ్యాఖ్యానించారు అసదుద్దీన్​ ఓవైసీ.

'జనాభాను నియంత్రించాలి..'

Owaisi vs Mohan Bhagwat : ఇటీవలే జరిగిన ఆర్​ఎస్​ఎస్​ సభలో జనాభా నియంత్రణ అంశంపై మోహన్​ భగవత్​ మాట్లాడారు. అందరికి సమానంగా వర్తించే ఒక విధానాన్ని తీసుకొచ్చి.. దేశంలో జనాభాను నియంత్రించాలని పిలుపునిచ్చారు. జనాభా నియంత్రణతో పాటు మతపరమైన అసమతుల్యతను తొలగించాలని, బలవంతపు మత మార్పిడీలను అడ్డుకోవాలని ప్రసంగించారు.

మోహన్​ భగవత్​ వ్యాఖ్యలను తిప్పికొట్టారు అసదుద్దీన్​ ఓవైసీ. నేషనల్​ ఫ్యామిలీ హెల్త్​ సర్వే-5ని ఉటంకిస్తూ.. ముస్లింలలో టీఆర్​ఎఫ్​(టోటల్​ ఫర్టిలిటీ రేట్​) భారీగా తగ్గిందని గుర్తుచేశారు. ముస్లింల గురించి కాకుండా.. తప్పిపోతున్న హిందూ బాలికల సమస్యపై దృష్టిపెట్టాలని హితవు పలికారు ఓవైసీ.

Asaduddin Owaisi on muslim population : "2000-2019 మధ్య అనేక మంది హిందూ బాలికలు తప్పిపోయారు. ఇది ప్రభుత్వ లెక్కల్లో ఉంది. కానీ మోహన్​ భగవత్​ దీని గురించి మాట్లాడటం లేదు. భారత జాతీయవాదానికి.. సవాలు విసురుతున్నారు. ఇది దేశానికే వ్యతిరేకం," అని అసదుద్దీన్​ ఓవైసీ అభిప్రాయపడ్డారు.

బీజేపీ ఎక్కడ ప్రభుత్వంలో ఉంటే.. అక్కడ ముస్లింలు జైల్లో జీవిస్తున్నట్టుగా భావిస్తున్నారని అసదుద్దీన్​ ఓవైసీ అన్నారు. గుజరాత్​లో ముస్లింలను స్తంభానికి కట్టేసి కొట్టారని, ప్రధాని మాత్రం మౌనంగా ఉన్నారని మండిపడ్డారు.

Asaduddin Owaisi news : "గర్భా సమయంలో కొందరు ముస్లింలను స్తంభానికి కట్టేసి కొట్టారు. ఇది ప్రధాని మోదీకి చెందిన గుజరాత్​లో జరిగింది. ఇదేనా దేశంలో ఉన్న గౌరవం? పోలీసు వ్యవస్థను మూసేయండి. కోర్టులను మూసేయండి," అని ఓవైసీ విమర్శించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం