Vande Bharat express accident : ‘వందే భారత్’కు మళ్లీ యాక్సిడెంట్- ఈసారి ఎద్దు!
Vande Bharat express accident : వందే భారత్‌కు మళ్లీ యాక్సిడెంట్ అయ్యింది. ఈసారి ఓ ఎద్దు.. ట్రైన్‌ను ఢీకొట్టింది.
Vande Bharat express accident : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు యాక్సిడెంట్‌కు గురై వార్తలకెక్కింది వందే భారత్. తాజాగా.. మళ్లీ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. శనివారం ఉదయం ముంబై సెంట్రల్ నుంచి గాంధీనగర్‌కు వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఓ ఎద్దును ఢీకొట్టింది. ఫలితంగా.. ట్రైన్ ముందు భాగం దెబ్బతింది.
ట్రెండింగ్ వార్తలు
శనివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గుజరాత్‌లోని అతుల్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో.. ఓ ఎద్దు రైల్వే ట్రాక్‌పైకి దూసుకొచ్చింది. అదే సమయంలో అటుగా వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఆ ఎద్దును ఢీకొట్టింది. ఘటన అనంతరం ట్రైన్ 15 నిమిషాలు నిలిచిపోయింది.
"రైలుకు ఎలాంటి నష్టం జరగలేదు. ముందు భాగం కాస్త విరిగింది. 15 నిమిషాల తర్వాత రైలు మళ్లీ బయలుదేరింది. ప్రయాణం సాఫీగానే సాగుతోంది. ఏదైనా తగిలితే ఆ తాకిడిని అబ్సార్బ్ చేసుకునే విధంగా నోస్ కవర్ని రూపొందించారు. ఆ నోస్ కవర్ని రిప్లేస్ చేసుకోవచ్చు," అని భారతీయ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
Vande Bharat express accident today : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ విధంగా జరగడం ఇది మూడోసారి. అక్టోబర్ 6న.. ముంబై నుంచి గాంధీనగర్‌కు వెళుతున్న క్రమంలో.. వట్వా- మనీనగర్ రైల్వే స్టేషన్ వద్ద గేదెను ఢీకొట్టింది. అప్పుడు కూడా నోస్ ప్యానెల్ దెబ్బతింది. ఆ మరుసటి రోజు గుజరాత్ నుంచి ముంబైకి వెళుతుండగా.. ఆనంద్ సమీపంలో ఓ ఆవు.. వందే భారత్ ట్రైన్‌ను ఢీకొట్టింది.
ఇటీవలే.. ఆవును ఢీకొట్టి నిలిచిపోయింది ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్.
వందే భారత్..
పూర్తిగా దేశీయంగా తయారు చేసిన సెమీ హైస్పీడ్ ట్రైన్‌గా గుర్తింపు పొందిన ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను.. సెప్టెంబర్ 30న గాంధీనగర్‌లో ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ తర్వాత నుంచి ఈ రైళ్లు వాణిజ్య కార్యకలాపాలు మొదలుపెట్టాయి.
సంబంధిత కథనం
Vande Bharat Express: ముచ్చటగా మూడో ‘సారీ..’
October 08 2022