Mumbai Goa highway : ఇక ముంబై టు గోవా ప్రయాణం.. కేవలం 5 గంటలే!-mumbai to goa in less than 5 hours national highway to be ready by 2024 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mumbai To Goa In Less Than 5 Hours? National Highway To Be Ready By 2024

Mumbai Goa highway : ఇక ముంబై టు గోవా ప్రయాణం.. కేవలం 5 గంటలే!

Sharath Chitturi HT Telugu
Apr 01, 2023 09:30 AM IST

Mumbai to Goa National highway : ముంబై- గోవా ప్రయాణం ప్రస్తుతం 11 గంటలు. త్వరలోనే నేషనల్​ హైవే 66 అందుబాటులోకి రానుంది. ఫలితంగా ప్రయాణం 5 గంటల కన్నా తక్కువగా ఉండనుంది!

ముంబై- గోవా నేషనల్​ హైవే పనులు..
ముంబై- గోవా నేషనల్​ హైవే పనులు.. (Nitin Gadkari/ Twitter)

Mumbai Goa National highway : ముంబై- గోవాని కనెక్ట్​ చేస్తూ నిర్మిస్తున్న నేషనల్​ హైవే 66 వచ్చే ఏడాది జనవరిలో అందుబాటులోకి రానుంది. ఫలితంగా.. ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న 11 గంటల జర్నీ.. ఇక 5 గంటలకు తగ్గిపోనుంది! ఈ వివరాలను కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

2024 జనవరి నాటికి రెడీ..!

నేషనల్​ హైవే 66 పనులను ఇటీవలే పరిశీలించారు నితిన్​ గడ్కరీ. ఏరియల్​ సర్వే నిర్వహించారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ జాతీయ రహదారి పనులు పూర్తవుతాయని హామీనిచ్చారు. 2024 జనవరి నాటికి అందుబాటులోకి రానుంది. పూర్తైన తర్వాత.. ఈ జాతీయ రహదారి కారణంగా ముంబై- గోవా మధ్య దూరం 600కి.మీల మేర తగ్గుతుందని వివరించారు. ఫలితంగా 5 గంటల కన్నా తక్కువ సమయంలోనే ముంబై నుంచి గోవాకు ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు.

Mumbai Goa highway status : ఈ ముంబై- గోవా నేషనల్​ హైవే 66ని మొత్తం 10 దశల్లో నిర్మిస్తున్నారు. ఇందులోని రెండు దశల్లో ఇంకా పనులు జరుగుతున్నాయి. డిసెంబర్​ నాటికి పనులు పూర్తవుతాయని నితిన్​ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.

రెండు టన్నెల్స్​లో ప్రయాణం..

జాతీయ రాహదారి కషేడి ఘాట్​ ప్రాంతంలో.. రెండు టన్నెల్స్​ ఉండనున్నాయి. వీటిల్లో ఒక టన్నెల్​ను వర్షాకాలం నాటికి ఓపెన్​ చేయాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. రెండో టన్నెల్​ పనులు ఈ ఏడాది అక్టోబర్​ నాటికి పూర్తవ్వనున్నాయి.

Mumbai Goa highway route : వాస్తవానికి.. ఈ హైవేలోని రెండు స్ట్రెచ్​లను 12ఏళ్ల ముందే పూర్తి చేయాల్సి ఉంది! భూముల కొనుగోళ్లు, అనుమతులు, కాంట్రాక్ట్​ పనుల వల్ల చాలా ఆలస్యమైపోయింది. ఇప్పుడు అన్ని సమస్యలు తొలగిపోయాయని నితిన్​ గడ్కరీ అన్నారు.

Mumbai Goa highway news : ఈ ముంబై- గోవా నేషనల్​ హైవే 66లో.. కోంకణ్​ ప్రాంతంలోని మొత్తం 66 పర్యాటక ప్రాంతాలు ఉంటాయి. ఫలితంగా రాష్ట్రాలకు రెవెన్యూ కూడా పెరిగి అవకాశం ఉంది.

IPL_Entry_Point