Hurun rich list : దేశంలో బిలియనీర్లు అధికంగా ఉన్న నగరం ఇదే..-mumbai reigns supreme with 66 billionaires show hurun global rich list ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mumbai Reigns Supreme With 66 Billionaires Show Hurun Global Rich List

Hurun rich list : దేశంలో బిలియనీర్లు అధికంగా ఉన్న నగరం ఇదే..

Sharath Chitturi HT Telugu
Mar 22, 2023 04:30 PM IST

2023 Hurun rich list : దేశంలో ఉన్న బిలియనీర్లలో చాలా మంది మంబైలోనే నివాసముంటున్నారు. 66మంది బిలియనీర్లు ముంబైలో ఉంటుండగా.. ఢిల్లీ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది.

దేశంలో బిలియనీర్లు అధికంగా ఉన్న నగరం ఇదే..
దేశంలో బిలియనీర్లు అధికంగా ఉన్న నగరం ఇదే.. (ANI)

Hurun rich list : దేశంలో అత్యధిక బిలియనర్లు నివాసముంటున్న నగరాల జాబితాలో ముంబై టాప్​లో నిలిచింది. దేశ వాణిజ్య రాజధానిలో 66మంది బిలియనీర్లు నివాసముంటున్నారు. 2023 హురున్​ గ్లోబల్​ రిచ్​ లిస్ట్​లో ఈ విషయం తేలింది.

ట్రెండింగ్ వార్తలు

ఇండియాలో యూఎస్​ డాలర్​ బిలియనీర్ల సంపద తగ్గట్టుగా ర్యాంకింగ్స్​ ఇస్తుంది ఈ హురున్​ గ్లోబల్​ రిచ్​ లిస్ట్​. 2023 రిచ్​ లిస్ట్​ ప్రకారం.. ముంబై తర్వాత, ఎక్కువ మంది బిలియనీర్లు ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ఉన్నారు. 39మంది సంపన్నులు ఢిల్లీలో ఉండగా, 21మంది కోటీశ్వరులు బెంగళూరులో నివాసముంటున్నారు.

2023 Hurun rich list : దేశంలోని 24 నగరాలు/ పట్టణాల్లో 187 బిలియనీర్లు ఉన్నారు. ఈ విషయంలో, ప్రపంచవ్యాప్తంగ ఇండియా 6వ స్థానంలో నిలిచింది. 2023 హురున్​ గ్లోబల్​ రిచ్​ లిస్ట్​ ప్రకారం.. అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న టాప్​ 25 నగరాల్లో ముంబై, ఢిల్లీ, బెంగళూరుకు స్థానం దక్కింది.

గ్లోబల్​ రిచ్​ లిస్ట్​లో భారతీయుల ర్యాంక్​లు శరవేగంగా పెరుగుతున్నట్టు హురున్​ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా.. అదానీ గ్రూప్​ ఛైర్మన్​ గౌతమ్​ అదానీ కుటుంబం గత పదేళ్లల్లో 437 ర్యాంక్​లు దాటేసింది. ముంబైలో అత్యంత సంపన్నుడిగా ముకేశ్​ అంబానీ కొనసాగుతున్నారు. గత పదేళ్లల్లో ఆయన సంపద 356శాతం మారింది. ముకేశ్​ అంబానీతో పాటు బిలియనీర్లు దిలీప్​ శాంగ్వీ, రాధాకృష్ణన్​ దమానీ, కుమార మంగళం బిర్లా, ఉదయ్​ కొటాక్​లు ముంబైలోనే నివాసముంటున్నారు.

ముకేశ్​ అంబానీ టాప్​..

Mukesh Ambani Hurun rich list : "2023 ఏషియన్​ రిచ్​ లిస్ట్​లో ముకేశ్​ అంబానీకి తొలి స్థానం దక్కింది. ఆయన సంపద.. గతంతో పోల్చుకుంటే 20శాతం తగ్గి 82 యూఎస్​ బిలియన్​ డాలర్లకు చేరింది. అదానీ కుటుంబం 35శాతం సంపద కోల్పోవడంతో మూడో స్థానానికి పడిపోయింది. రెండో స్థానంలో షాంగ్​ షాంషా ఉన్నారు," అని హురున్​ రిచ్​ లిస్ట్​ వెల్లడించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం