Swiggy : ఫుడ్​ డెలివరీ.. ఇలా కూడా చేయొచ్చా?-mumbai rains viral video swiggy delivery boy rides horse to drop off order ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mumbai Rains Viral Video Swiggy Delivery Boy Rides Horse To Drop Off Order

Swiggy : ఫుడ్​ డెలివరీ.. ఇలా కూడా చేయొచ్చా?

Sharath Chitturi HT Telugu
Jul 03, 2022 02:26 PM IST

Swiggy : ముంబై వర్షాల నేపథ్యంలో ఓ స్విగ్గీ డెలివరీ బాయ్​ చేసిన పని ఇప్పుడు వైరల్​గా మారింది. నీటితో నిండిపోయిన రోడ్ల మీద.. గుర్రంపై ఎక్కి ఫుడ్​ డెలివరీ చేశాడు ఆ స్విగ్గీ డెలివరీ బాయ్​. ఆ వీడియోను మీరూ చూసేయండి మరి..

గుర్రంపై స్విగ్గీ డెలివరీ బాయ్​
గుర్రంపై స్విగ్గీ డెలివరీ బాయ్​ (Youtube)

Swiggy : సాధారణంగా మీరు స్విగ్గీలో ఫుడ్​ ఆర్డర్​ ఇస్తే.. డెలివరీ చేసేందుకు స్విగ్గీ డెలివరీ బాయ్​ బైక్​ మీద వస్తాడు. కానీ.. గుర్రం మీద వచ్చే స్వగ్గీ డెలివరీ బాయ్​ని మీరు ఎప్పుడైనా చూశారా? ముంబైలో వర్షాల నేపథ్యంలో ఇదే జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

నైరుతి రుతుపవనాల నేపథ్యం ముంబైలో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. ఏది ఏమైనా.. సాధారణ పనులు జరగాల్సిందే కదా. వర్షం పడుతోందని ఆగిపోలేము కదా! ఆ స్విగ్గీ డెలివరీ బాయ్​ కూడా ఇదే అనుకున్నాడు. వాహనాలు నడపడం కష్టంగా ఉన్న ప్రాంతంలో.. గుర్రం మీద వెళ్లి ఫుడ్​ డెలివరీ చేశాడు ఆ స్విగ్గీ డెలివరీ బాయ్​.

వీడియోలో ఈ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గుర్రం మీద ఓ వ్యక్తి ఉన్నాడు. అతని వెనకాలా స్విగ్గీ బ్యాగ్​ ఉంది. ఫుడ్​ డెలివరీ చేసేందుకు ఆ స్విగ్గీ డెలివరీ బాయ్​.. ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు.. 'వావ్​' అంటున్నారు. విపరీతంగా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన స్విగ్గీ డెలివరీ బాయ్​ వీడియో ఇక్కడ చూడండి:

Mumbai rains : మరోవైపు ముంబైలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబై వర్షాల నేపథ్యంలో నగరానికి ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేసింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్