Mumbai airport : ప్రయాణికులకు అలర్ట్​.. 6 గంటల పాటు ముంబై ఎయిర్​పోర్ట్​ మూసివేత!-mumbai airport to remain shut for these hours on october 18 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mumbai Airport To Remain Shut For These Hours On October 18

Mumbai airport : ప్రయాణికులకు అలర్ట్​.. 6 గంటల పాటు ముంబై ఎయిర్​పోర్ట్​ మూసివేత!

Sharath Chitturi HT Telugu
Sep 23, 2022 07:04 AM IST

Mumbai airport to remain shut : ముంబై విమానాశ్రయం.. 6 గంటల పాటు పనిచేయదు. ఎప్పుడు? ఎందుకు? అన్న వివరాల కోసం ఈ వార్తను చూడండి.

ప్రయాణికులకు అలర్ట్​.. ముంబై ఎయిర్​పోర్ట్​ మూసివేత- ఎప్పుడంటే!
ప్రయాణికులకు అలర్ట్​.. ముంబై ఎయిర్​పోర్ట్​ మూసివేత- ఎప్పుడంటే! (HT)

Mumbai airport to remain shut : విమాన ప్రయాణికులకు అలర్ట్​.! ముంబైలోని సీఎస్​ఎంఐఏ(ఛత్రపతి శివాజి మహారాజ్​ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​).. అక్టోబర్​ 18న కొన్ని గంటల పాటు మూతపడనుంది. విమానాశ్రయం నిర్వహణ పనుల కోసం ఈ చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు రన్​వేలను మూసివేస్తున్నట్టు ఓ ప్రకటన చేశారు ముంబై విమానాశ్రయం సిబ్బంది.

ట్రెండింగ్ వార్తలు

ముంబై ఎయిర్​పోర్ట్​లో రెండు రన్​వేలు ఉన్నాయి(9/27- 14/32). ఇక్కడ రోజుకు 800కుపైగా విమానాల రాకపోకలు ఉంటాయి. దేశంలో ఢిల్లీ విమానాశ్రయం తర్వాత.. అత్యంత రద్దీగా ఉండే ఎయిర్​పోర్ట్​ ఇదే!

Mumbai airport closed : రెండు రన్​వేలు పనిచేయవు..

"అక్టోబర్​ 18న.. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రన్​వేలను 14/32, 9/27 మూసివేస్తున్నాము," అని ముంబై ఎయిర్​పోర్ట్​ పేర్కొంది.

సాధారణంగా రుతుపవనాల సమయం ముగిసిన తర్వాత నిర్వహణ పనులు చేస్తూ ఉంటారు. ఈసారి అక్టోబర్​ 18న ఈ కార్యకలాపాలు చేపట్టారు ముంబై ఎయిర్​పోర్ట్​ సిబ్బంది. ప్రయాణికులు, విమానాల భద్రత కోసం ఇలాంటి నిర్వహణ పనులు చేయాల్సి ఉంటుంది.

ముంబై విమానాశ్రయం రన్​వేల మూసివేతతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు సిబ్బంది. పలు ఫైట్లను రీషెడ్యూల్​ చేశారు. ఫలితంగా మెయింటేనెన్స్​కి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ విషయంలో ప్రయాణికుల నుంచి సహకారాన్ని ఆశిస్తున్నట్టు ముంబై ఎయిర్​పోర్ట్​ అభిప్రాయపడింది.

Mumbai airport latest news : ఈ ముంబై విమానాశ్రయంలో అదానీ గ్రూప్​నకు 74శాతం వాటా ఉంది.

ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల విమానాశ్రయాల్లో ముంబై ఎయిర్​పోర్ట్​ ఒకటి. 2022 సెప్టెంబర్​ 17న.. 1,30,374మంది ప్రయాణికులు ఈ ముంబై విమానాశ్రయాన్ని వినియోగించుకున్నారు. ఇదొక రికార్డు.

Mumbai airport news in telugu : "95,080మంది ప్రయాణికులు టర్మినల్​ 2 ద్వారా ప్రయాణాలు చేశారు. 35,294 మంది.. టర్మినల్​ 1 నుంచి ప్రయాణించారు. ఆ ఒక్క రోజులో 839 విమానాలు ముంబై ఎయిర్​పోర్ట్​లో ల్యాండ్​ అయ్యాయి," అని విమానాశ్రయ సిబ్బంది స్పష్టం చేశారు.

ఇక పండుగ సీజన్​ సమీపిస్తుండటంతో.. ముంబై విమానాశ్రయంలో రద్దీ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

IPL_Entry_Point

సంబంధిత కథనం