MSTC Recruitment 2023: ఎంఎస్టీసీలో మేనేజ్మంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లు.. అప్లై చేయండిలా..-mstc limited recruitment 2023 apply for 52 mt and am posts at mstcindiacoin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mstc Limited Recruitment 2023: Apply For 52 Mt And Am Posts At Mstcindia.co.in

MSTC Recruitment 2023: ఎంఎస్టీసీలో మేనేజ్మంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లు.. అప్లై చేయండిలా..

HT Telugu Desk HT Telugu
May 27, 2023 07:04 PM IST

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ లిమిటెడ్ (MSTC Limited) లో మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో www.mstcindia.co.in వైబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఎంఎస్టీసీ లిమిటెడ్ (MSTC Limited) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. కోల్ కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. గతంలో దీనిని మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ గా పిలిచేవారు. తాజాగా, ఈ సంస్థలో మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో www.mstcindia.co.in వైబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

లాస్ట్ డేట్ జూన్ 11

మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లపై ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో www.mstcindia.co.in వైబ్ సైట్ ద్వారా మే 27వ తేదీ నుంచి జూన్ 11 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 52 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీలను మినహాయించి, మిగతా వారంతా రూ. 500 లను అప్లికేషన్ ఫీగా చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్లను షార్ట్ లిస్ట్ చేసిన తరువాత, అర్హత కలిగిన అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది.

అప్లై చేసుకోవడం ఇలా?

ఎంఎస్టీసీ లిమిటెడ్ (MSTC Limited) లో మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఆన్ లైన్ లో ఈ కింది విధంగా అప్లై చేసుకోవచ్చు.

  • ఎంఎస్టీసీ లిమిటెడ్ అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై కనిపించే కెరియర్ (career) ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
  • అక్కడ కనిపించే అప్లై (Apply) లింక్ పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
  • సబ్మిట్ బటన్ నొక్కి, అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోవాలి.

Direct link to apply

WhatsApp channel