'నా బట్టలు చించారు'.. ఢిల్లీ పోలీసులపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్-mp jothimani allegations on delhi police over tore her clothes ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mp Jothimani Allegations On Delhi Police Over Tore Her Clothes

'నా బట్టలు చించారు'.. ఢిల్లీ పోలీసులపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్

HT Telugu Desk HT Telugu
Jun 16, 2022 12:55 PM IST

ఢిల్లీ పోలీసులపై కాంగ్రెస్‌ ఎంపీ జోతిమణి తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు తనపై దాడి చేసి, తన దుస్తులను చించారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆ పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌ ట్విట్టర్ లో పోస్ట్‌ చేశారు.

కాంగ్రెస్ ఎంపీ జోతిమణి
కాంగ్రెస్ ఎంపీ జోతిమణి (twitter)

Congress MP Jothimani: ఢిల్లీ పోలీసుల తీరుపై కాంగ్రెస్ ఎంపీ జోతిమణి మండిపడ్డారు. తన బిట్టలు చింపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యులపై పోలీసులు ఇలా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణించాలంటూ స్పీకర్ ఓంబిర్లాకు ఆమె విజ్ణప్తి చేశారు. నేరస్థుల వలే మమ్మల్ని బస్సుల్లోకి ఎక్కించి గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని చెప్పారు. కనీసం మంచినీళ్లు అడిగినా ఇవ్వలేదని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ ట్వీట్ చేశారు. 

ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీ పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు శశి థరూర్.ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఇది అత్యంత దారుణమైన ఘటన అని పేర్కొన్నారు. మహిళా నిరసనకారులతో ఇలా వ్యవహరించడం.. ప్రతి భారతీయుడి మర్యాదకు భంగం కలిగించినట్లే అంటూ థరూర్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

ఏం జరిగిందంటే....

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ మూడు రోజులుగా విచారిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఢిల్లీలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ సందర్భంలోనే పోలీసులు తన బట్టలు చింపేశారంటూ ఎంపీ జోతిమణి వెల్లడించారు.

మరోవైపు పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు దాడి చేయటాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. దీనిపై తుగ్లక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అక్బర్ రోడ్డులోని ప్రవేశించి ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ కార్యకర్తలపై దాడి చేశారని ఫిర్యాదులో ప్రస్తావించింది. ఇందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు, ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

IPL_Entry_Point

టాపిక్