Papua New Guinea Landslide : ప్రకృతి విపత్తుకు 2వేల మంది సజీవ సమాధి..!-more than 2 000 people buried alive in massive landslide in papua new guinea ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Papua New Guinea Landslide : ప్రకృతి విపత్తుకు 2వేల మంది సజీవ సమాధి..!

Papua New Guinea Landslide : ప్రకృతి విపత్తుకు 2వేల మంది సజీవ సమాధి..!

Sharath Chitturi HT Telugu

Papua New Guinea news : పపువా న్యూ గినియాలో విషాదం. కొండచరియలు విరిగి పడిన ఘటనలో.. 2000వేల మంది సజీవంగా కూరుకుపోయారు. సహాయక చర్యలు సైతం అతి కష్టంగా కొనసాగుతున్నాయి.

ప్రకృతి విపత్తుకు 2వేల మంది బలి..! (via REUTERS)

Landslide in Papua New Guinea : ప్రకృతి విపత్తు కారణంగా పపువా న్యూ గినియా అల్లాడిపోతోంది. కొండచరియలు విరిగి పడిన ఘటనలో.. 2వేల మంది సజీవంగా కూరుకుపోయారు. ఈ విషయాన్ని దేశం స్వయంగా.. ఐక్యరాజ్య సమితికి వెల్లడించింది. అత్యంత క్లిష్టపరిస్థితుల్లో సహాయక చర్యలు కష్టంగా సాగుతున్నాయి.

ఇదీ జరిగింది..

పపువా న్యూ గినియా ఎంగ రాష్ట్రంలోని ఓ కొండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున.. మౌంట్​ మంగలోని ఒక భాగం విరిగి.. కింద ఇళ్ల మీద పడింది. ఆ సమయంలో ప్రజలు నిద్రపోతుండటంతో ఘటన తీవ్రత మరింత పెరిగింది.

"కొండచరియలు విరిగిపడిన ఘటనలో 2వేల మంది సజీవంగా కూరుకుపోయారు. ఆ ప్రాంతంలో భారీ విధ్వంసం జరిగింది," అని పపువా న్యూ గినియా జాతీయ విపత్తు కేంద్రం.. ఐక్యరాజ్య సమతికి తెలిపింది.

Papua New Guinea landslide death toll : ఈ ప్రకృతి విపత్తుకు భవనాలు, ఫుడ్​ గార్డెన్లు నాశనం అయ్యాయి. ఇది.. దేశ ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడుతుందని పపువా న్యూ గినియా చెబుతోంది.

ఇదీ చూడండి:- MH370 mystery : ఎంహెచ్​370 మిస్టరీ వీడిందా? ఆ దట్టమైన అడవిలో విమానం కనిపించిందా?

పోర్గేరా మైన్​కి వెళ్లే ప్రధాన రహదారి.. పూర్తిగా బ్లాక్​ అయిపోయింది.

"ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఇంకా ఉంది. అందుకే.. బాధితులకు, సహాయక చర్యలు చేపట్టే బృందాలకు ప్రాణ ముప్పు పొంచి ఉంది," అని అధికారులు తెలిపారు.

20 నుంచి 26 అడుగుల లోతు వరకు బాధితులు కూరుకుపోయి ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు.. బాధితుల కోసం వెతికి వెతికి.. ఒళ్లు హూనం చేసుకున్న సహాయక సిబ్బందికి ఆశలు సన్నగిల్లుతున్నట్టు తెలుస్తోంది. రక్షించిన కొందరిని ఆసుపత్రులకు తరలించినప్పటికీ.. ఆచూకీ గల్లంతైన వారు ఇంకా చాలా మంది ఉండటం అందరిని బాధకు గురిచేస్తోంది.

తమ వారి కోసం వెతుకుతూ అక్కడి ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ దృశ్యాలను చూసిన వారు ఆవేదనకు గురవుతున్నారు. 

Papua New Guinea landslide : "ఇంతటి భారీ విపత్తును ఎదుర్కొనేందుకు.. అత్యవసర సాయం కావాలి. ఆర్మీ కూడా రావాలి," అని యూఎన్​కు పపువా న్యూ గినియ చెప్పింది.

యూఎన్​కు పపువా న్యూ గినియా.. వివరణ ఇచ్చే ముందు వరకు.. ఈ ఘటనలో 670మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక లెక్కలు చెప్పాయి. 

పూర్తి మరణాలు, గాయపడిన వారు, ప్రకృతి విపత్తుతో కలిగిన ఆర్థిక నష్టం గురించి డేటా వచ్చేందుకు ఇంకొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.