దారుణంగా పడిపోయిన రాజ్యసభ ఉత్పాదకత- రెండు వారాల్లో పని చేసింది 11గంటలే!-monsoon session rs productivity falls further to 16 in 2nd week house yet to pass a bill ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Monsoon Session: Rs Productivity Falls Further To 16% In 2nd Week, House Yet To Pass A Bill

దారుణంగా పడిపోయిన రాజ్యసభ ఉత్పాదకత- రెండు వారాల్లో పని చేసింది 11గంటలే!

Sharath Chitturi HT Telugu
Jul 31, 2022 05:18 PM IST

Parliament Monsoon session: పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు మొదలై రెండు వారాలు గడిచిపోయింది. కానీ పెద్దల సభగా పేరొందిన రాజ్యసభలో కార్యకలాపాలు సరిగ్గా జరగడం లేదు. ఇప్పటివరకు కేవలం 11గంటలు మాత్రమే పనిచేసింది. రాజ్యసభ ఉత్పాదకత కూడా భారీగా పడిపోయింది.

దారుణంగా పడిపోయిన రాజ్యసభ ఉత్పాదకత
దారుణంగా పడిపోయిన రాజ్యసభ ఉత్పాదకత (ANI)

Parliament Monsoon session: ఈ దఫా పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ ఉత్పాదకత దారుణంగా పతనమైంది. ముఖ్యంగా రెండోవారం.. ‘పెద్దల సభ’గా పేరొందిన రాజ్యసభ ఉత్పాదకత 16.49శాతంగా నమోదైంది. మొదటి వారంలో అది 26.90శాతంగా ఉంది. ధరల పెరుగుదల, జీఎస్​టీ, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై విపక్షాలు నిరసన చేస్తుండటంతో.. ఈ రెండు వారాల్లో రాజ్యసభ అనేకమార్లు వాయిదా పడింది. అంతేకాకుండా.. రెండు వారాల్లోనే 23మంది ఎంపీలు సస్పెన్షన్​కు గురయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

మొత్తం మీద.. పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ ఉత్పాదకత 21.58శాతంగా ఉంది. జులై 18న ప్రారంభమైన రాజ్యసభ.. ఇప్పటివరకు 10సార్లు సమావేశమైంది. కానీ రాజ్యసభ పనిచేసింది 11గంటల 8 నిమిషాలు మాత్రమే. షెడ్యూల్​ ప్రకారం.. ఈ రెండు వారాల్లో రాజ్యసభ 51 గంటల 35 నిమిషాలు పనిచేయాల్సి ఉంది. అంటే.. ఇప్పటికే 40గంటల 45 నిమిషాల సమయం వృథా అయిపోయింది.

Rajya Sabha productivity : అంతేకాకుండా.. ఈ దఫా పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో.. రాజ్యసభలో ఇప్పటివరకు ఒక్క బిల్లు కూడా పాస్​ అవ్వలేదు. జీరో హవర్​(శున్య గంట) కూడా జరగలేదు. రెండు వారాల్లో.. క్వశ్చన్​ హవర్​ కూడా ఆరు రోజులు జరగలేదు.

విపక్షాల నిరసనలపై రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్​ ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు. సభ వెల్​లోకి ఎంపీలు దూసుకొస్తుండటాన్ని తప్పుబట్టారు.

అటు లోక్​సభలోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీపై తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నాయి విపక్షాలు. ఫలితంగా స్పీకర్​.. సభను వాయిదా వేయకతప్పడం లేదు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్