జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: కిరణ్ రిజిజు-monsoon session of parliament from july 21 to august 12 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: కిరణ్ రిజిజు

జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: కిరణ్ రిజిజు

Sudarshan V HT Telugu

పార్లమెంటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (PTI)

జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. మూడు నెలల విరామం తర్వాత జూలై 21న ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలు సమావేశం కానున్నాయి.

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో..

పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ల తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరగడం ఇదే తొలిసారి. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసి వాటిని నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. కశ్మీర్ లోని పహల్గామ్ లో 26 మందిని పొట్టనబెట్టుకున్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.

ఆపరేషన్ సిందూర్ పై వివరణ

2025 జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కాగా, ఈ సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్ పై ప్రభుత్వం సమగ్ర ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు, ఆపరేషన్ సిందూర్ లో భారత దళాలకు జరిగిన నష్టంపై విపక్షాలు వివరణ కోరనున్నారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.