Monsoon 2024 : గుడ్​ న్యూస్​ చెప్పిన ఐఎండీ- ఈసారి సాధారణం కన్నా అధిక వర్షాలు..-monsoon in india likely above normal this year predicts imd ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Monsoon 2024 : గుడ్​ న్యూస్​ చెప్పిన ఐఎండీ- ఈసారి సాధారణం కన్నా అధిక వర్షాలు..

Monsoon 2024 : గుడ్​ న్యూస్​ చెప్పిన ఐఎండీ- ఈసారి సాధారణం కన్నా అధిక వర్షాలు..

Sharath Chitturi HT Telugu
Apr 15, 2024 04:20 PM IST

Monsoon 2024 prediction : ప్రజలకు చల్లటి కబురు ఇచ్చింది ఐఎండీ. ఈసారి.. రుతుపవనాల ప్రభావం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

ఈసారి సాధారణం కన్నా అధిక వర్షాలు..
ఈసారి సాధారణం కన్నా అధిక వర్షాలు..

Monsoon 2024 IMD : ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న భారత ప్రజలకు కాస్త ఉపశమనాన్ని కలిగించే వార్త ఇచ్చింది భారత వాతావరణశాఖ ఐఎండీ. ఈ ఏడాది రుతుపవనాల ప్రభావం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అంటే.. ఈసారి.. సాధారణ కన్నా అధికంగా వర్షాలు పడనున్నాయి.

yearly horoscope entry point

"ఇండియాలో రుతుపవనాల ప్రభావం ఈసారి సాధారణం కన్నా ఎక్కువగానే ఉంటుంది. లాంగ్​ పీరియడ్​ యావరేజ్​ (ఎల్​పీఏ) 106శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాము," అని ఐఎండీ వెల్లడించింది.

భారత వాతావరణశాఖ ప్రకారం.. రుతుపవనాల తొలినాళ్లల్లో.. ఎల్​ నీనో బలహీనపడుతుంది. ఫలితంగా.. ఆ తర్వాతి రోజుల్లో దేశంలో జోరుగా వర్షాలు కురుస్తాయి.

Monsoon in India : ఇక లా నీనా పరిస్థితులపైనా కామెంట్స్​ చేసింది ఐఎండీ. గత 22 లా నినా పరిస్థితుల్లో.. 1974, 2000 ని మినహాయిస్తే.. చాలా వరకు సాధారణం లేదా సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదైందని రికార్డులు చెబుతున్నట్టు పేర్కొంది ఐఎండీ.

"1971 నుంచి 2020 వరకు ఉన్న డేటాను పరిగణలోకి తీసుకుని కొత్త లాంగ్​ పీరియడ్​ యావరేజ్​ని, నార్మల్​ స్టాండర్డ్​ని ప్రవేశపెట్టాము. దీని ప్రకారం.. జూన్​ 1 నుంచి సెప్టెంబర్​ 30 వరకు.. దేశవ్యాప్తంగా వర్షపాతం 87 సెంటీమీటర్లుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నాము," అని ఎర్త్​ సైన్సెస్​ మంత్రిత్వశాఖ సెక్రటరీ ఎం రవిచన్​రన్​ తెలిపారు.

"ఉత్తర భాగంలో మంచు ప్రభావం ఈసారి తక్కువగానే కనిపించింది. మంచుకు, వర్షానికి ప్రతికూల సంబంధం ఉంటుంది. ఫలితంగా.. ఈసారి సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నాము," అని ఐఎండీ తెలిపింది.

Monsoon 2024 India : ప్రతియేటా జూన్​ నుంచి సెప్టెంబర్​ వరకు ఉండే రుతుపవనాలు.. భారత దేశానికి చాలా కీలకం. పైగా.. గతేడాది చాలా ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ఇక ఇప్పుడు.. ఈ ఏడాది రుతుపవనాల ప్రభావం సాధారణం కన్నా ఎక్కవగా ఉంటుందన్నది సానుకూల విషయం.

అప్పటివరకు వడగాల్పులు తప్పవు..

ఇక రుతుపవనాల విషయాన్ని పక్కనపెడితే.. ఇండియాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్​ 1 వారం నుంచే ఈ పరిస్థితులు మొదలయ్యాయి. రుతుపవనాలు ప్రవేశించేవరకు ఇలాంటి పరిస్థితే ఉంటుందని ఐఎండీ కూడా చెబుతోంది. 2024 లోక్​సభ ఎన్నికలు కూడా ఇదే సమయంలో ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు ఇచ్చింది భారత వాతావరణశాఖ.

Telangana Heatwave : సాధారణంగా ప్రతియేటా జూన్​ 1కి అటు, ఇటుగా రుతుపవనాలు ఇండియాను తాకుతాయి. ఈసారి రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి? అన్నది ఐఎండీ ఇంకా చెప్పాల్సి ఉంది. అప్పటి వరకు.. ప్రజలు వడగాల్పులతో ఇబ్బంది పడక తప్పదు!

స్కైమెట్​ అంచనాలు ఇవి..

కొన్ని రోజుల క్రితం.. రుతుపవనాలపై కీలక ప్రకటన చేసింది ప్రైవేట్​ వాతావరణ సంస్థ స్కైమెట్​. ఈ ఏడాది రుతుపవనాల ప్రభావం సాధారణంగా ఉంటుందని వెల్లడించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​లలో వర్షాలు అధికంగా కురుస్తాయని స్కైమెట్​ చెప్పింది. కానీ.. బిహార్​, పశ్చిమ్​ బెంగాల్​లో మాత్రం లోటు వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం