Patna crime news : స్కూల్ డ్రైనేజ్‌లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!
Patna boy found dead : బిహార్ పట్నాలో ఓ స్కూల్ తగలబడింది! ఆ స్కూల్ డ్రైనేజ్‌లో ఓ బాలుడి మృతదేహం కనిపించడంతో.. అతని తల్లిదండ్రులు, స్థానికులు విధ్వంసం సృష్టించారు.
Body found inside drain of school : బిహార్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అదృశ్యమైన ఓ బాలుడి మృతదేహం.. స్కూల్ డ్రైనేజ్‌లో కనిపించింది! ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించగా.. నిరసనల్లో సంబంధిత పాఠశాల తగలబడింది.
ఇదీ జరిగింది..
బిహార్ రాజధాని పట్నాలోని దిఘా అనే ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. నాలుగేళ్ల బాలుడు.. దిఘా-పాల్సన్ రోడ్డు సమీపంలో నివాసముంటాడు. ఎప్పటిలానే.. గురువారం ఉదయం స్కూల్‌కి వెళ్లాడు. కానీ తిరిగిరాలేదు!
భయాందోళనకు గురైన బాలుడి తల్లిదండ్రులు.. స్కూల్‌కి వెళ్లి వెతికారు. బాలుడు ఎక్కడా కనిపించలేదు. స్కూల్ టీచర్లు, తోటి విద్యార్థులు, స్నేహితులను ప్రశ్నించారు. కానీ ఫలితం దక్కలేదు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సైతం.. బాలుడిని గాలించడం ప్రారంభించారు. ఫలితం దక్కకపోగా.. అందరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు.. స్కూల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు.
Patna crime news : ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో.. ఓ మృతదేహం, స్కూల్ డ్రైనేజ్‌లో కనిపించింది. బాలుడి తండ్రిని పోలీసులు పిలిపించారు. అది తమ బిడ్డేనని తండ్రి విలపించాడు.
ఉదయం అయ్యేసరికి.. స్కూల్ డ్రైనేజ్‌లో బాలుడి మృతదేహం దొరికిందన్న వార్త స్థానికంగా సంచలనం సృష్టించింది. బాధతో ఆగ్రహంతో ఊగిపోయిన తల్లిదండ్రులు, స్థానికులు.. దిఘా- పట్నా రోడ్డు, దిఘా- అషైనా రోడ్డులో విధ్వంసం సృష్టించారు. భారీ ఎత్తున్న ఆందోళనలు చేపట్టారు. ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డు మీద టైర్లను కాల్చారు. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనిపించింది.
అనంతరం.. సంబంధిత స్కూల్‌కు వెళ్లారు నిరసనకారులు. స్కూల్లో విధ్వంసం సృష్టించారు.
Digha school crime : మరోవైపు.. పోస్టుమార్టం కోసం బాలుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరరలించారు. రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనపై కిడ్నాప్, మర్డర్ కేసు నమోదు చేసుకున్నట్టు వివరించారు.
బాలుడిని ఎవరు చంపారు?
తమ కుటుంబం అంటే పడని వారే బాలుడిని చంపేశారని.. కుటుంబసభ్యులు చెపుతున్నారు.
"నా కొడుకు.. స్కూల్లో చదువుకునేవాడు. స్కూల్ పరిసరాల్లో ట్యూషన్‌కి వెళ్లేవాడు. గురువారం ఉదయం 6 గంటలకు స్కూల్‌కి వెళ్లిన అతను.. సాయంత్రం ఐదైనా తిరిగి రాలేదు. నా బిడ్డని ఎవరో చంపేశారు," అని 4ఏళ్ల బాలుడి తండ్రి వివరించారు.
మరోవైపు.. ఆ బాలుడు గురువారం అసలు స్కూల్‌కే రాలేదని పాఠశాల సిబ్బంది చెబుతోంది. కానీ.. సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించి పోలీసులు.. బాలుడు స్కూల్‌కి వెళ్లినట్టు నిర్థరించారు. అయితే.. స్కూల్ సిబ్బంది, 10 నిమిషాల ఫుటేజ్‌ని టాంపర్ చేసినట్టు అధికారులు చెప్పారు.
Latest crime news : "బాలుడు ఉదయం స్కూల్‌కి వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటల వరకు స్కూల్లోనే ఉన్నాడు. అక్కడి నుంచి ట్యూషన్‌కి వెళ్లాడు. 2:30 వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత జారుడుబండ మీద నుంచి పడ్డాడు. అతని తలకి గాయమైంది. స్పృహ కోల్పోయాడు. స్కూల్ డైరక్టర్- ప్రిన్సిపల్ కొడుకు.. బాలుడిని చూశాడు. అతడిని మోసుకెళ్లి క్లాస్‌రూమ్‌కు సమీపంలోని డ్రైనేజ్‌లో పడేశాడు. బాలుడికి గాయాలవ్వడం.. సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది," అని పోలీసులు వెల్లడించారు.
ప్రిన్సిపల్‌తో పాటు ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకున్నట్టు, విచారణ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
సంబంధిత కథనం