Misdiagnosis deaths: తప్పుడు వ్యాధి నిర్ధారణతో ఏటా 3.7 లక్షల మంది మృతి
Misdiagnosis deaths: వ్యాధుల నిర్ధారణలో అత్యంత ఆధునిక టెక్నాలజీని వాడుతున్నారు. టెక్నాలజీ సాయంతో అత్యంత నిశితంగా పరిశీలించి వ్యాధులను డయాగ్నైజ్ చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ విధానాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు నిజానికి వైద్యుల పనిని చాలా వరకు సులభం చేశాయి. కానీ నాణేనికి మరో వైపు ఉంది.
Misdiagnosis deaths: వ్యాధుల నిర్ధారణలో అత్యంత ఆధునిక టెక్నాలజీని వాడుతున్నారు. టెక్నాలజీ సాయంతో అత్యంత నిశితంగా పరిశీలించి వ్యాధులను డయాగ్నైజ్ చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ విధానాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులు నిజానికి వైద్యుల పనిని చాలా వరకు సులభం చేశాయి. కానీ నాణేనికి మరో వైపు కూడా ఉంది. తప్పుడు వ్యాధి నిర్ధారణలతో ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
3.7 lakh Misdiagnosis deaths: ప్రతీ సంవత్సరం 3.7 లక్షల మందికి పైగా..
తప్పుడు వ్యాధి నిర్ధారణ వల్ల ప్రాణాలు కోల్పోవడం అంత దారుణం, దురదృష్టం మరొకటి ఉండదు. కానీ, అలా తప్పుడు డయాగ్నసిస్ కారణంగా ప్రతీ సంవత్సరం లక్షలాది మంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలోనే ప్రతీ సంవత్సరం తప్పుడు వ్యాధి నిర్ధారణల కారణంగా ప్రతీ సంవత్సరం 3.71 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా న్యుమోనియా (pneumonia), సెప్సిస్ (sepsis), ఊపిరితిత్తుల కాన్సర్ (lung cancer), బ్రెయిన్ స్ట్రోక్ (stroke), వీనస్ త్రాంబోఎంబోలిజం (venous thromboembolism) వంటి వ్యాధుల నిర్ధారణలో చోటు చేసుకుంటున్న పొరపాట్ల కారణంగా ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి.
John Hopkins study: జాన్ హాప్కిన్స్ స్టడీ
తప్పుడు వ్యాధి నిర్ధారణల కారణంగా అమెరికాలో ప్రతీ సంవత్సరం 3.71 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాగే, 4.24 లక్షల మంది అంధత్వం, బ్రెయిన్ డ్యామేజ్, మతిపరుపు వంటి శాశ్వత సమస్యల బారిన పడుతున్నారని అమెరికాకు చెందిన జాన్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ (John Hopkins School of Medicine) నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఆ అధ్యయనం ప్రకారం.. అమెరికాలో ఏటా సగటున సుమారు 9.5 లక్షల మందికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. వారిలో 18% మందికి, అంటే సుమారు 94 వేల మందికి, దాన్ని స్ట్రోక్ గా గుర్తించడం లేదు. తీవ్రమైన తలనొప్పి, తల తిరుగుతున్నట్లుగా ఉండడం వంటివి కూడా స్ట్రోక్ లక్షణాలే అన్న విషయాన్ని వెంటనే గుర్తించడం లేదు. అలాగే, దాదాపు 60% మందిలో కేంద్ర నాడీ వ్యవస్థ కు వచ్చే ఇన్ఫెక్షన్ (spinal abscess) ను కూడా సరిగ్గా గుర్తించడం లేదు. వ్యాధి నిర్ధారణలో నిర్ధారిత లక్షణాలకు ఇచ్చే ప్రాధాన్యత, అనుబంధ లక్షణాలకు ఇవ్వకపోవడం వల్ల కూడా తప్పుడు వ్యాధి నిర్ధారణకు కారణమవుతోంది. అందువల్ల, అసలు సమస్యకు కాకుండా, వేరే వ్యాధికి చికిత్స తీసుకోవడం వల్ల ఇతర తీవ్రమైన సమస్యలు తలెత్తుతున్నాయి.