‘తల్లివేనా అసలు?’- బాయ్​ఫ్రెండ్​ చేత మైనర్​ కూతురిని రేప్​ చేయించిన మహిళ.. ఎనిమిదిసార్లు!-minor gang raped 8 times in presence of mother in uttarakhand ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘తల్లివేనా అసలు?’- బాయ్​ఫ్రెండ్​ చేత మైనర్​ కూతురిని రేప్​ చేయించిన మహిళ.. ఎనిమిదిసార్లు!

‘తల్లివేనా అసలు?’- బాయ్​ఫ్రెండ్​ చేత మైనర్​ కూతురిని రేప్​ చేయించిన మహిళ.. ఎనిమిదిసార్లు!

Sharath Chitturi HT Telugu

ఉత్తరాఖండ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్​పై 8సార్లు అత్యాచారం జరిగింది. చేయించింది ఆమె సొంత తల్లి! చేసింది.. ఆ మహిళ బాయ్​ఫ్రెండ్​, అతని సహచరుడు. కాగా, ఆ మహిళ ఒక బీజేపీ నేత. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆమెను బీజేపీ తొలగించింది.

ఉత్తరాఖండ్​లో దారుణం! (Representative image/HT Photo)

ఉత్తరాఖండ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బీజేపీ బహిష్కృత నేత.. తన ప్రియుడు, మరో పురుషుడి చేత సొంత కూతురిని రేప్​ చేయించింది. తల్లి సమక్షంలోనే మైనర్​పై 8సార్లు అత్యాచారం జరిగింది!

అసలేం జరిగిందంటే..

సదరు మహిళ కొంతకాలం క్రితం తన భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి తన ప్రియుడితో కలిసి హోటళ్లల్లో ఉంటోంది. మాజీ భర్త దగ్గర ఉన్న తన 13ఏళ్ల కూతురును తరచూ కలుస్తూ ఉంటుంది.

అయితే సొంత కూతురుకు ఆ తల్లి నరకం చూపించింది! కలిసినప్పుడల్లా మద్యం తాగించేది. తన బాయ్​ఫ్రెండ్​, అతని సహచరుడి చేత శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేసేది. "జీవితంలో ఇది సాధారణం" అని బిడ్డకు చెప్పేది.

ఇదే అదనుగా భావించిన ఆ మహిళ బాయ్​ఫ్రెండ్​, అతని సహచరుడు.. బాలికపై కనీసం 8సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తన తండ్రికి చెబుతానని బాలిక అన్నప్పుడు.. చంపేస్తానని స్వయంగా తల్లి బెదిరించడం గమనార్హం.

అందుకే బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. నెలల పాటు జరిగిన అత్యాచార సంఘటనల తర్వాత, చివరికి పూర్తి విషయాన్ని తన తండ్రికి ఇటీవలే చెప్పింది. ఆయన..పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళతో పాటు 30ఏళ్లు పైబడిన ఆ ఇద్దరు పురుషులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. గత బుధవారం హరిద్వార్​లోని ఒక హోటల్​లో మహిళ- ఆమె బాయ్​ఫ్రెండ్​ని అరెస్ట్​ చేశారు. మరో వ్యక్తిని యూపీ మీరట్​లో పట్టుకున్నారు. వీరిని జ్యుడీషియల్​ కస్టడీకి తరలించారు.

కాగా.. కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పలు షాకింగ్​ విషయాలు తెలిశాయి.

"బాలిక ఎనిమిది సార్లు రేప్​నకు గురైంది. ఈ ఏడాది జనవరిలో కారులో తొలి ఘటన జరిగింది. ఆ తర్వాత నుంచి ఆగ్రా, బృందావన్​ సహా అనేక ప్రాంతాల్లోని హోటల్స్​లో బాలికపై అత్యాచారాలు జరిగాయి. ప్రతిసారి బాలికకు, ఆమె తల్లి మద్యం తాగించేది. ఆ తర్వాత, ఆమె బాయ్​ఫ్రెండ్​- అతని సహచరులు రేప్​ చేసేవారు," అని పోలీసులు వెల్లడించారు.

ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలికపై వైద్య పరీక్షలు నిర్వహించగా, అత్యాచారం జరిగినట్టు తేలిందని వివరించారు.

ఈ వ్యవహారం ఉత్తరాఖండ్​లో కలకలం రేపింది. సదరు మహిళ పార్టీ సభ్యత్వాన్ని బీజేపీ తొలగించింది. అంతేకాదు, 2024 నుంచి ఆమె పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా లేదని తెలిపింది. ఆ సమయానికే పార్టీ బాధ్యతలను సరిగ్గా చూసుకోవడం లేదని ఆమెపై ఆరోపణలు ఉన్నట్టు పేర్కొంది.

ఈ పూర్తి వ్యవహారం రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రతిపక్ష కాంగ్రెస్​, బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. 'బేటీ బచావో- బేటీ పడావో' అనే బీజేపీ నినాదాలు విఫలం అయ్యాయని ఆరోపించింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.