Telugu News  /  National International  /  Minor Dalit Girl Raped At Amethi In Uttarpradesh
మైనర్ బాలికపై అత్యాచారం (ప్రతీతాత్మక చిత్రం)
మైనర్ బాలికపై అత్యాచారం (ప్రతీతాత్మక చిత్రం)

Dalit Girl raped : యూపీలో మైనర్ బాలికపై అత్యాచారం

09 October 2022, 10:46 ISTHT Telugu Desk
09 October 2022, 10:46 IST

Dalit girl raped in Amethi: యూపీలోని అమేథిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

girl raped at amethi in uttar pradesh: దేశంలో చిన్నారులపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరో కేసు వెలుగుచూసింది. 15 ఏళ్ల మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

పోలీసుల వివరాల ప్రకారం...

జామో ప్రాంతంలో 15 ఏళ్ల దళిత మైనర్ బాలికపై రేప్ జరిగింది. అక్టోబర్ 3వ తేదీన ఈ ఘటన జరిగినట్లు ఫిర్యాదు వచ్చింది. దుర్గామాతా మండపంలో సంగీతం పరికరాలను ఏర్పాటు చేస్తున్న వ్యక్తి... బహిర్భూమికి వెళ్లిన మైనర్ బాలికపై అత్యాచారం జరిపినట్లు ఫిర్యాదులో పేర్కొంంది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీస్ అధికారి అఖిలేశ్ గుప్తా మాట్లాడుతూ... రేప్ ఘటనపై కేసు నమోదు చేశాం. నిందితుడిపై ఐపీసీ 376తో పాటు పోస్కో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని మోనోగా గుర్తించగా... అతడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

మృతదేహాలు లభ్యం...

ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఓ డ్యామ్ నుండి ముగ్గురి మహిళల మృతదేహాలు బయటపడ్డాయి, మధ్యప్రదేశ్ సరిహద్దులోని టికామ్‌ఘర్ జిల్లా నుంచి వారు కొట్టుకుపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతలంతా 25 ఏళ్లలోపుగానే ఉన్నారని పేర్కొన్నారు. పోస్టుమార్టం కోసం తరలిస్తున్నట్లు వెల్లడించింది.