Militancy in Jammu : ఉగ్రవాద చెర నుంచి 'జమ్ము'కు విముక్తి..!-militancy at its lowest ebb in j k jammu region almost cleared of menace says dgp ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Militancy At Its Lowest Ebb In J-k; Jammu Region Almost Cleared Of Menace Says Dgp

Militancy in Jammu : ఉగ్రవాద చెర నుంచి 'జమ్ము'కు విముక్తి..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 11, 2022 07:30 AM IST

Jammu region free of terror : జమ్ము ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు కనిష్ఠ స్థాయికి చేరాయని అధికారులు వెల్లడించారు. భద్రతా దళాలను చూసి ఉగ్రవాదులు భయపడుతున్నట్టు పేర్కొన్నారు.

ఉగ్రవాద చెర నుంచి 'జమ్ము'కు విముక్తి..!
ఉగ్రవాద చెర నుంచి 'జమ్ము'కు విముక్తి..! (PTI)

Militancy in Jammu : ఉగ్రవాదంతో నిత్యం అల్లాడిపోతున్న జమ్ముకశ్మీర్​లో శాంతి నెలకొంటోంది. ముఖ్యంగా జమ్ము ప్రాంతానికి.. ఉగ్రవాద చెర నుంచి దాదాపుగా విముక్తి లభించింది! ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్బాగ్​ సింగ్​ తెలిపారు. భద్రతా దళాల దూకుడుకు.. ఉగ్రవాదులు సైతం భయపడిపోతున్నట్టు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

"లెక్కలను పరిగణలోకి తీసుకుంటే.. జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదం అనేది ఇప్పుడు కనిష్ఠ స్థాయికి పడిపోయింది. జమ్ములో ఉన్న 10జిల్లాల్లోని తొమ్మిది జిల్లాల్లో ఉగ్రవాదుల కార్యకలాపాలు లేవు. మిగిలిన ఒక జిల్లాలో.. 3,4 ఉగ్రవాదులు యాక్టివ్​గా ఉన్నారు. వారిని కూడా పట్టుకుంటాము," అని దిల్బాగ్​ సింగ్​ వెల్లడించారు.

2022లో ఉగ్రవాదంపై భద్రతా దళాలు భారీ స్థాయిలో పోరాటం చేసి విజయం సాధించినట్టు జమ్ముకశ్మీర్​ డీజీపీ స్పష్టం చేశారు. ఎవరైనా ఉగ్రవాదంలో చేరాలంటే.. ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నట్టు, ఇది భద్రతా దళాల వల్లే సాధ్యమైనట్టు వివరించారు.

Jammu region free of terror : "ఇక్కడి యువతకు మేము కౌన్సిలింగ్​ ఇస్తున్నాము. జమ్ముకశ్మీర్​లో జరుగుతున్న రక్తపాతంతో సంబరాలు చేసుకుంటున్న పాకిస్థానీ ఏజెన్సీల ఉచ్చులో పడవద్దని స్పష్టంగా చెబుతున్నాము. పాకిస్థానీ ఏజెన్సీల వల్ల 30ఏళ్లుగా జమ్ముకశ్మీర్​లో అలజడులు నెలకొన్నాయి. కనీ వాటి దుశ్చర్యలను, వ్యూహాలను అర్థం చేసుకుని, ఆ ఉచ్చులో నుంచి బయటపడాల్సిన సమయం వచ్చింది," అని దిల్బాగ్​ సింగ్​ అభిప్రాయపడ్డారు.

ఉగ్రవాదంపై పోరాటంలో ప్రజల పాత్ర కూడా అధికంగా ఉందన్నారు జమ్ముకశ్మీర్​ డీజీపీ.

Jammu terrorism news : "ప్రజల నుంచి మాకు పూర్తి మద్దతు లభిస్తోంది. భారీ సంఖ్యలో యువత మాకు మద్దతిస్తోంది. ఉగ్రవాదం కనిష్ఠ స్థాయికి చేరుకోవడానికి ముఖ్య కారణం ఇదే. ఇప్పుడున్న ఉగ్రవాదులను కూడా అంతం చేసేస్తాము. అందుకోసం ఇప్పటికే రంగంలోకి దిగాము," అని దిల్బాగ్​ సింగ్​ తెలిపారు.

జమ్ముకశ్మీర్​లో శాంతియుత వాతావరణాన్ని దెబ్బ తిసేందుకు ఎలాంటి ప్రణాళికలు రచించినా, వాటిని సమర్థవంతంగా తిప్పికొడతామని ధీమా వ్యక్తం చేశారు డీజీపీ.

ఉగ్రవాది నివాసం కూల్చివేత..

జమ్ముకశ్మీర్​ పుల్వామాలోని జైషే మహమ్మద్​ కమాండర్​ ఆషిఖ్​ నెంగ్రూ నివాసాన్ని అధికారులు శనివారం కూల్చివేశారు. రాజ్​పొరాలోని రెండస్థుల భవనాన్ని బుల్డోజర్​ సాయంతో నేలమట్టం చేశారు.

Ashiq Nengroo house demolished in Jammu Kashmir : 2019 పుల్వామా దాడిలో వాంటెడ్​ టెర్రరిస్ట్గా ఉన్నాడు నెంగ్రూ. జమ్ముకశ్మీర్​లోకి ఉగ్రవాదుల చొరబడటంలో నెంగ్రూది కీలక పాత్ర అని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వివిధ ఉగ్రవాద ఘటనల్లో అతని హస్తం ఉందని అధికారులు భావిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు ముమ్మరంగా చర్యలు చేపట్టారు పోలీసులు.

IPL_Entry_Point