Dallas air show : ఎయిర్​ షోలో ఘోర ప్రమాదం.. గాలిలో రెండు విమానాలు ఢీ!-midair plane crash in dallas air show caught on video 6 feared dead ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Midair Plane Crash In Dallas Air Show Caught On Video; 6 Feared Dead

Dallas air show : ఎయిర్​ షోలో ఘోర ప్రమాదం.. గాలిలో రెండు విమానాలు ఢీ!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 13, 2022 07:27 AM IST

Dallas air show 2022 : రెండో ప్రపంచ యుద్ధం నాటి రెండు విమానాలు.. గాలిలో ఢీకొన్నాయి. చివరికి బూడిదగా మారాయి. అమెరికా డల్లాస్​ ఎయిర్​ షోలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

గాలిలో రెండు విమానాలు ఢీ!
గాలిలో రెండు విమానాలు ఢీ! (Twitter)

Dallas air show 2022 : అమెరికా డల్లాస్​లో నిర్వహించిన ఓ ఎయిర్​ షోలో ఘోర ప్రమాదం సంభవించింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి రెండు విమానాలు.. గాలిలో ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటన అనంతరం ఈ విమానాలు బూడిదగా మారిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు

డల్లాస్​ ఎయిర్​ షోలో ప్రమాదానికి గురైన విమానాల పేర్లు.. బోయింగ్​ బీ-17 ఫ్లయింగ్​ ఫోర్ట్రెస్​, బెల్​ పీ-63 కింగ్​కోబ్రా. కాగా.. ఈ ఘటనతో కలిగిన ప్రాణ నష్టం గురించి అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ స్థానిక మీడియా ప్రకారం.. ప్రమాదం సమయంలో రెండు విమానాల్లో మొత్తం ఆరుగురు ఉన్నారు. వీరందరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.

ఏం జరిగింది..?

డల్లాస్​లో శనివారం ఎయిర్​ షోను నిర్వహించారు. ఎయిర్​ షోలో విమానాల విన్యాసాలను చూసేందుకు ప్రజలు తరలివెళ్లారు. కొద్దిసేపటి తర్వాత బోయింగ్​ బీ-17 నేల మీద నుంచి బయలుదేరింది. గాలిలో ఎగిరి.. స్ట్రెయిట్​ లైన్​లో ప్రయాణం మొదలుపెట్టింది. ఇంతలో.. బెల్​ పీ-63 అటువైపు దూసుకెళ్లింది. అందరు చూస్తుండగానే.. బెల్​ పీ- 63.. బోయింగ్​ బీ-17ని ఢీకొట్టింది. క్షణాల్లో మంటలు పుట్టుకొచ్చాయి. ఆ వెంటనే రెండు విమానాలు నేలకూలాయి. అక్కడి ప్రజలందరు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు.

Boeing B-17 Flying Fortress air crash: "నేను అక్కడే నిలబడి ఉన్నాను. చాలా షాకింగ్​గా ఉంది. నమ్మలేకపోతున్నా. అందరు షాక్​కు గురయ్యారు. వారి కళ్లల్లో కన్నీరు కనిపించింది." అని ఎయిర్​ షోకు వెళ్లిన ఓ వ్యక్తి చెప్పారు.

ఈ ఘటనపై డల్లాస్​ మేయర్ ఎరిక్​ జాన్సన్​​ స్పందించారు. ఘటనతో షాక్​కు గురైనట్టు తెలిపారు. ఘటనాస్థలాన్ని నేషనల్​ ట్రాన్స్​పోర్ట్​ సేఫ్టీ బోర్డు.. తన ఆధీనంలోకి తీసుకుందని వివరించారు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సాయం అందించిందని స్పష్టం చేశారు.

Bell P-63 Kingcobra air crash : అమెరికా ఫైటర్​ జెట్​గా గుర్తింపు పొందిన కింగ్​కోబ్రాను యుద్ధం సమయంలో సోవియెట్​ యూనియన్​ ఉపయోగించింది. బీ-17 అనేది ఒక ఫోర్​ ఇంజిన్​ బాంబర్​. రెండో ప్రపంచ యుద్ధంలో దీనిని జర్మనీపై పోరాటానికి ఉపయోగించారు. అసలు ఈ రెండూ ఇప్పడు కూడా ఎగరడం చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని నిపుణులు చెప్పారు.

యుద్ధం తర్వాత బీ-17 విమానాలను ధ్వంసం చేశారు. కొన్ని మాత్రమే మ్యూజిమ్స్​లో ఉన్నాయి. ఇంకొన్ని ఇలా ఎయిర్​ షోలో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.

Dallas air show viral video : సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన వీడియోను ఇక్కడ చూడండి:

IPL_Entry_Point

సంబంధిత కథనం