5 నెలల్లో 60 వేల ఉద్యోగాలు హాంఫట్; అమెరికాలోని ఉద్యోగుల్లో గుబులు-microsoft to crowdstrike tech firms lead 2025 layoffs as 60 thousand jobs vanish in just 5 months period ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  5 నెలల్లో 60 వేల ఉద్యోగాలు హాంఫట్; అమెరికాలోని ఉద్యోగుల్లో గుబులు

5 నెలల్లో 60 వేల ఉద్యోగాలు హాంఫట్; అమెరికాలోని ఉద్యోగుల్లో గుబులు

Sudarshan V HT Telugu

2025 సంవత్సరం కూడా టెక్ ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపుతోంది. 2025 ప్రారంభమైన తరువాత ఈ 5 నెలల్లోనే అమెరికాలో సుమారు 60 వేలమంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. మున్ముందు మరిన్ని టెక్ కంపెనీలు లే ఆఫ్ దిశగా నిర్ణయాలు తీసుకోనున్నాయి.

అమెరికాలోని ఉద్యోగుల్లో గుబులు

మైక్రోసాఫ్ట్, క్రౌడ్ స్ట్రైక్, మెటా, బ్లాక్ వంటి దిగ్గజాలు లే ఆఫ్ ప్రకటించడంతో 2025 ప్రారంభం నుంచి యూఎస్ లో ఇప్పటివరకు సుమారు 60,000 టెక్ ఉద్యోగాలు కనుమరుగయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, ఖర్చును తగ్గించుకునే ప్రయత్నాలు, ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు వంటి కారణాలతో టెక్, ప్రభుత్వ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది.

సంక్షోభంలో టెక్ ఉద్యోగాలు

లేఆఫ్ ట్రాకర్ వెబ్సైట్ లేఆఫ్స్.ఎఫ్వైఐ (layoffs.fyi) ఈ డేటాను బయటపెట్టింది. ఫెడరల్ డిపార్ట్మెంట్లతో పాటు అమెరికాలోని పలు పారిశ్రామిక రంగాల్లో రియల్ టైమ్ లేఆఫ్ డేటాను ఇది ట్రాక్ చేస్తుంది. టెక్ క్రంచ్ ప్రకారం ఒక్క ఏప్రిల్ నెలలోనే 23,400 టెక్ ఉద్యోగాలు పోయాయి. నేషనల్ పార్క్ సర్వీస్ తో సహా ప్రభుత్వ సంస్థలు వేలాది మందిని ఇంటికి పంపించేశాయి. ఇతర ఉద్యోగులను తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని, సర్దుబాటు చేసుకోవాలని కోరారు. లేఆఫ్స్.ఎఫ్వైఐ (layoffs.fyi) లో ప్రస్తుత గణాంకాల ప్రకారం 2025లోనే వందకు పైగా కంపెనీల్లో 59,413 మంది టెక్ ఉద్యోగులను తొలగించారు.

క్రౌడ్ స్ట్రైక్ లో అత్యధికం

వీరిలో క్రౌడ్ స్ట్రైక్ ఏప్రిల్ నెలలోనే 500 లేఆఫ్ లతో అగ్రస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా, మెటా, మైక్రోసాఫ్ట్, బ్లాక్ వంటి కంపెనీలు ఇటీవలి నెలల్లో ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం క్రమంగా చాలా టెక్ కంపెనీలు ఉద్యోగాల కోతలపై నిర్ణయాలు తీసుకోనున్నాయి. అమెజాన్, గూగుల్, టెస్లా కూడా ఉద్యోగులను తగ్గించాయి. ఖర్చును తగ్గించడం, బలమైన నెట్వర్క్లను నిర్మించడం, రాబోయే ఉపాధి ఒడిదుడుకులను తట్టుకోవడానికి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం గురించి నిపుణులు ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారు.

ఫెడరల్ విభాగాల్లో కోత

ప్రస్తుతానికి ఎలన్ మస్క్ ప్రాజెక్టులు 61,296 ఫెడరల్ ఉద్యోగాలను తగ్గించాయి. 2025లోనే మొత్తం 1,71,843 ఫెడరల్ నిష్క్రమణలు జరిగాయి. డిఓజి లేఆఫ్ స్ట్రక్చర్ మరియు నమూనాలో, రవాణా విభాగం 23.5% ఉద్యోగాల కోతలను చూసింది, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ 13.3% ఉద్యోగాల కోతను చూసింది. మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీలు కూడా లే ఆఫ్ లను ప్రకటించడంలో వెనుకబడలేదు. కేపీఎంజీ, ఈవై, డెలాయిట్ వంటి అగ్రశ్రేణి సంస్థలు కూడా తక్కువ అట్రిషన్, లాభాల మార్జిన్లపై ఒత్తిడి వంటి కారణాలతో ఉద్యోగుల తొలగింపును ప్రకటించాయని ఫోర్బ్స్ తెలిపింది. Entrepreneur.com నివేదిక ప్రకారం, బిగ్ ఫోర్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ పిడబ్ల్యుసి కూడా యుఎస్కు చెందిన 1,500 మంది ఉద్యోగులను తొలగించింది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.