MHA, IB recruitment: హోంశాఖ, ఇంటలిజెన్స్ బ్యూరోల్లో భారీ రిక్రూట్మెంట్; 995 పోస్ట్ ల భర్తీ
MHA, IB recruitment: కేంద్ర హోం శాఖ (MHA), ఇంటలిజెన్స్ బ్యూరో (IB) ల్లో భారీ రిక్రూట్మెంట్ కు తెర లేచింది. మొత్తం 995 ACIO II/ ఎగ్జిక్యూటివ్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు.
MHA, IB recruitment: కేంద్ర హోం శాఖ (MHA), ఇంటలిజెన్స్ బ్యూరో (IB) ల్లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ - గ్రేడ్ 2( ACIO II/ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 995 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు.
ఆన్ లైన్ అప్లికేషన్
ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా కేంద్ర హోం శాఖ అధికారిక వెబ్ సైట్ mha.gov.in, లేదా ncs.gov.in లోని సమగ్ర నోటిఫికేషన్ ను క్షుణ్నంగా పరిశీలించాలి. ఈ పోస్ట్ లకు అభ్యర్థులు ఆన్ లైన్ లో నవంబర్ 25వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ 15 వ తేదీ.
Vacancy Details: వేకెన్సీ వివరాలు
రిజర్వేషన్ల వారీగా వేకెన్సీల వివరాలు ఇలా ఉన్నాయి..
UR: 377 పోస్ట్‌లు
EWS: 129 పోస్ట్‌లు
OBC: 222 పోస్టులు
SC: 134 పోస్టులు
ST: 133 పోస్టులు
Eligibility Criteria: అర్హత, ఇతర వివరాలు
ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థి వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
Examination Fees: పరీక్ష ఫీజు
జనరల్, ఈ డబ్ల్యూఎస్, ఓబీసీ పురుష అభ్యర్థులు పరీక్ష ఫీజు రూ. 100, అలాగే రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు రూ. 450/- చెల్లించాలి. మిగతా వారు ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఫీజును ఆన్ లైన్ లో డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI, SBI చలాన్ మొదలైన వాటి ద్వారా SBI EPAY LITE ద్వారా చెల్లించవచ్చు.
Selection Process: ఎంపిక ప్రక్రియ
రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వ్రాత పరీక్షలో టైర్ I మరియు టైర్ II అనే రెండు అంచెలు ఉంటాయి . టైర్ Iలో 100 ఆబ్జెక్టివ్ టైప్ బహుళైచ్ఛిక ప్రశ్నలు (MCQ)లు ఉంటాయి. ఇవి 5 విభాగాలుగా ఉంటాయి. ఒక్కో విభాగంలో 20 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఒక గంట వ్యవధిలో ఈ పరీక్షను పూర్తి చేయాలి. టైర్ IIలో 50 మార్కుల డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ ఉంటుంది. పరీక్ష వ్యవధి 1 గంట. ఈ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో భాగంగా సైకోమెట్రిక్ పరీక్ష కూడా ఉంటుంది.