MH370 mystery : ఎంహెచ్​370 మిస్టరీ వీడిందా? ఆ దట్టమైన అడవిలో విమానం కనిపించిందా?-mh370 mystery solved aircraft located in jungle using google maps real truth ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mh370 Mystery : ఎంహెచ్​370 మిస్టరీ వీడిందా? ఆ దట్టమైన అడవిలో విమానం కనిపించిందా?

MH370 mystery : ఎంహెచ్​370 మిస్టరీ వీడిందా? ఆ దట్టమైన అడవిలో విమానం కనిపించిందా?

Sharath Chitturi HT Telugu

MH370 mystery : ఎంహెచ్​370 మిస్టరీ వీడిందా? ఇప్పుడు ఈ ప్రశ్న మరోమారు హట్​ టాపిక్​గా మారింది. ఇందుకు సంబంధించిన పలు నివేదికలను బ్రిటీష్​ వార్తా సంస్థలు ప్రచురించడం ఇందుకు కారణం.

ఎంహెచ్​370 మిస్టరీ వీడిందా? (AP)

MH370 google maps : ప్రపంచంలో అంతుచిక్కని మిస్టరీల్లో.. ఎంహెచ్​370 విమానం ఒకటి. 2014 మార్చ్​ 8న ఈ విమానం అదృశ్యమవ్వగా.. ఇప్పటికీ దీనిపై చర్చలు జరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు మిస్టరీపై సరికొత్త వివరాలు తెలుస్తుంటాయి. ఇందుకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్​గా మారింది​. ఎంహెచ్​370 మిస్టరీని తాను పరిష్కరిచానని ఓ నిపుణుడు చెప్పిన మాటలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. గూగుల్​ మ్యాప్స్​ ద్వారా.. విమాన శకలాలను గుర్తించినట్టు వివరించాడు.

ఎంహెచ్​370 మిస్టరీ వీడిందా?

2014 మార్చ్​ 8న.. దక్షిణ చైనా సముద్రం మీదుగా ప్రయాణిస్తుండగా.. ఎంహెచ్​370 విమానం ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ తర్వాత అది ఎప్పటికీ కనిపించలేదు. గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం దక్కలేదు. మలేషియాలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా ఈ ఘటన మిగిలిపోయింది.

కౌలాలంపూర్​ నుంచి బీజింగ్​కి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరందరు మరణించినట్టు అధికారులు ప్రకటించారు.

కాగా.. ఈ ఎంహెచ్​370 విమాన ఘటన గురించి ఇటీవలే ఒక రిపోర్టును ప్రచురించాయి బ్రిటీష్​ వార్తా సంస్థలు. 2018లో నిపుణుడు ఐయాన్​ విల్సన్​ చేసిన వ్యాఖ్యల ఆధారంగ రిపోర్టును రూపొందించి రిలీజ్​ చేశాయి.

MH370 mystery solved : గూగుల్​ మ్యప్స్​ ద్వారా శాటిలైట్​ ఇమేజ్​లని పరిశీలిస్తుండగా.. తాను ఎంహెచ్​370 విమానాన్ని గుర్తించినట్టు ఆ నిపుణులు చెప్పుకొచ్చాడు. కంబోడియాలోని దట్టమైన అడవుల్లో ఎంహెచ్​370 విమానాన్ని గుర్తించినట్టు చెప్పుకొచ్చాడు.

"గూగుల్​ ఎర్త్​ని గంటలు గంటలు సెర్చ్​ చేశాను. విమానం ఎక్కడ కూలి ఉంటుంది? అని చాలా వెతికాను. చివరికి.. విమానం ఎక్కడుందో కనిపించింది. ప్రపచంలోనే అత్యంత పచ్చదమనం, అత్యంత చీకటి ఉన్న భాగంలో విమానం పడింది," అని ఆ యూకే ఆధారిత నిపుణుడు గతంలో చెప్పుకొచ్చాడు.

ఇందులో నిజమెంత?

విల్సన్​ మాటలపై యూకే వార్తా సంస్థలు రూపొందించిన నివేదికతో ఎంహెచ్​370 మిస్టరీ ఇప్పుడు మళ్లీ హాట్​ టాపిక్​ అయ్యింది. అయితే.. ఇందులో నిజమెంత? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ ఇదే విషయంపై న్యూస్​వీక్​ అనే సంస్థ గత సెప్టెంబర్​లో కాస్త రీసెర్చ్​ చేసింది. నిపుణులు చూపించిన ఫొటో.. 2004 జనవరి 1ది అని తేలినట్టు స్పష్టం చేసింది. అంటే.. ఎంహెచ్​370 విమానం అదృశ్యమవ్వడానికి ముందుదు ఆ ఫొటోలో కనిపిస్తున్న ఎయిర్​క్రాఫ్ట్​.

MH370 latest news : ఎంహెచ్​370 విమానానికి సంబంధించిన శకలాలు హిందూ మహా సముద్రంలోని ఓ ద్వీపానికి కొట్టుకొచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంతో తెలియలేదు. మరోవైపు.. ఎంహెచ్​370 విమానాన్ని గుర్తించేందుకు అధికారులు చేసిన విశ్వ ప్రయత్నాలు ఫలించలేదు. విమానానికి సంబంధించిన ఒక్క భాగాన్ని కూడా ఇప్పటివరకు గుర్తించలేకపోయరు. కానీ వీటిపై చాలా కథలు ఉన్నాయి.

మరోవైపు.. విమానాన్ని గుర్తించడానికి పలువురు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పలు కంపెనీలు ముందుకు వచ్చి.. ఎంహెచ్​370 విమానం చివరిగా కనిపించిన చోట గాలింపు చర్యలు చేపట్టాలని ప్రయత్నిస్తున్నాయి. టెక్సాస్​ ఆధారిత ఓషన్​ ఇన్ఫినిటీ .. తాము గాలింపు చర్యలు చేపడతామని తాజాగా ప్రతిపాదన చేసింది. ఇందుకు సంబంధించి.. మలేషియా ప్రభుత్వాన్ని కూడా సంప్రదించింది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.