Meteor : ఆకాశంలో మరో అద్భుతం.. కళ్లకు కనువిందు..!-meteor lights up night sky over chile ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Meteor Lights Up Night Sky Over Chile

Meteor : ఆకాశంలో మరో అద్భుతం.. కళ్లకు కనువిందు..!

Sharath Chitturi HT Telugu
Jul 10, 2022 03:20 PM IST

Meteor : చిలీ రాజధాని సాంటియాగోలో ఉల్క ఒకటి దర్శనమిచ్చింది. ఆకాశం నుంచి ఉల్క పడటంతో రాత్రి వేళ కాంతి నిండుకుంది. ఆ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.

ఆకాశంలో మరో అద్భుతం.. కళ్లకు కనువిందు..!
ఆకాశంలో మరో అద్భుతం.. కళ్లకు కనువిందు..! (Youtube)

Meteor : ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్క్రతమైంది. ఓ ఉల్క.. ఆకాశం నుంచి భూమి మీదకు పడింది. ఆ సమయంలో రాత్రి వేళ.. ఆకాశం అంతా కాంతితో నిండిపోయింది. ఆ అద్భుత దృశ్యం చిలీ రాజధాని సాంటియాగోలో దర్శనమిచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

రిపోర్టుల ప్రకారం.. జులై 7న.. ఆ ఉల్క ఆకాశంలో కనివిందు చేసింది. అయితే అది భూమి వాతావరణంలోకి ప్రవేశించిన క్షణాల్లోనే మంటల్లో కాలిపోయిందని కాన్​సెప్సియాన్​ వర్సిటీ నిపుణులు చెప్పారు.

సాంటియాగోలో కనిపించిన ఉల్క.. ఆండెస్​ ప్రాంతంలో పడిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. కాగా.. ఆకాశం నుంచి పడుతున్న సమయంలో.. కాంతితో పాటు భారీ శబ్దాలు కూడా వినిపించాయి. అది ఉరుముల శబ్దంలాగా అనిపించిందని స్థానిక ప్రజలు పేర్కొన్నారు.

"ఆకాశం నుంచి కిందకి పడే వస్తువులు సాధారణంగా గంటకు 10వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. గాలితో ఏర్పడే ఫిక్షన్​ వల్ల.. చిన్న రాళ్లు, బండరాళ్లుకు నిప్పు అంటుకుని, భూమి మీద పడే ముందే కాలిపోతాయి," అని చిలీ అస్ట్రానమీ ఫౌండేషన్​కు చెందిన బేమిన్​ పేర్కొన్నారు.

కాగా.. జులై 7నే మరో ఉల్క.. న్యూజిలాండ్​లోని వెల్లింగ్టన్​లో కనిపించినట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా మంటల్లో కాలిపోయినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో కూడా ఆకాశంలో కాంతి అలుముకుందని, భారీ శబ్దం వచ్చిందని స్థానిక మీడియా పేర్కొంది.

WhatsApp channel

సంబంధిత కథనం