పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోన్ 'మోసం' కేసులో భారతదేశం చేసిన అభ్యర్థన మేరకు పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యాపారవేత్త తన భార్య ప్రీతి చోక్సీతో కలిసి దేశంలోని ఆంట్వెర్ప్లో నివసిస్తున్నట్లు మీడియా నివేదికలు ధృవీకరించిన కొన్ని వారాల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది.
వజ్రాల వ్యాపారిని శనివారం అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇంటర్‌పోల్ ఆయన అరెస్ట్‌పై రెడ్ నోటీస్‌ని డిలీట్ చేసిన అనంతరం, భారత్‌కు చెందిన ఈడీ, సీబీఐలు బెల్జియం అధికారులకు మెహుల్ చోక్సీ అప్పగింత కోసం అభ్యర్థన చేసినట్టు, ఆ తర్వాతే ఈ అరెస్ట్ జరిగినట్టు సమాచారం.
మెహుల్ చోక్సీని భారత్‌కు అప్పగించాలని అధికారులు బెల్జియం అఫీయల్స్ని అడిగినట్టు మార్చ్‌లో కూడా పలు నివేదికలు బయటకు వచ్చాయి.
గీతాంజలి జెమ్స్ వ్యవస్థాపకుడు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మోసం కేసులో నిందితుడిగా ఉన్న మెహుల్ చోక్సీకి 2023 నవంబర్ 15న బెల్జియంలో రెసిడెన్సీ లభించింది.
రూ.13,500 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో భారత్‌లో వాంటెట్‌గా ఉన్న మెహుల్ చోక్సీ గతంలో ఆంటిగ్వా, బార్బుడాలో ఉంటూ బెల్జియంకు మకాం మార్చాడు.
ఆయన భార్య ప్రీతి చోక్సీ బెల్జియం పౌరసత్వం కలిగి ఉన్నారు.
అసోసియేటెడ్ టైమ్స్ కథనం ప్రకారం మెహుల్ చోక్సీ బెల్జియంలో ఉండేందుకు 'ఎఫ్ రెసిడెన్సీ కార్డు' పొందాడు. అయితే, ఆయన నివాసాన్ని పొందడానికి, భారతదేశానికి అప్పగించకుండా తప్పించుకునే ప్రయత్నంలో తప్పుడు డిక్లరేషన్లు, నకిలీ పత్రాలతో సహా తప్పుదోవ పట్టించే విధంగా కల్పిత పత్రాలను బెల్జియం అధికారులకు సమర్పించాడు.
మెహుల్ చోక్సీ తన భారతీయ, ఆంటిగ్వా పౌరసత్వాలను వెల్లడించడంలో విఫలమయ్యాడని, దరఖాస్తు ప్రక్రియలో తన జాతీయతను తప్పుగా చూపించాడని సమాచారం.
స్విట్జర్లాండ్‌లోని ఓ ప్రముఖ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స కోసం మెహుల్ చోక్సీ ఆ దేశానికి వెళ్లే యోచనలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. క్యాన్సర్ ఉందనే అనుమానంతో చికిత్స కోసం ఆయన బెల్జియంకు వెళ్లినట్టు ఫిబ్రవరిలో ఆయన తరఫు న్యాయవాది ముంబై కోర్టుకు తెలిపారు.
మెహుల్ చోక్సీ తన మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ను మోసపూరితంగా లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ పొంది నేరం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నీరవ్ మోదీ లండన్ జైలులోని ఉన్నాడు. అనేక బెయిల్ తిరస్కరణల తరువాత ఆయన్ని భారతదేశానికి అప్పగించడానికి పోరాటం కొనసాగుతోంది.
మెహుల్ చోక్సీని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా (ఎఫ్ఈఓ) ప్రకటించాలన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థనను ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు విచారిస్తోంది.
నీరవ్ మోదీని 2019లో ఎఫ్ఈఓగా ప్రకటించగా, మెహుల్ చోక్సీపై ఈడీ పిటిషన్ 2018 నుంచి పెండింగ్‌లో ఉంది.
సంబంధిత కథనం