What happens after death : మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు.. బాలుడు ఆత్మహత్య!-meerut suicide boy shoots himself with pistol in front of family heres why ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  What Happens After Death : మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు.. బాలుడు ఆత్మహత్య!

What happens after death : మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు.. బాలుడు ఆత్మహత్య!

Sharath Chitturi HT Telugu
Jan 14, 2025 01:37 PM IST

యూపీ మీరట్​లో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరణం తర్వాత ఏం జరుగుతుంది? అని తెలుసుకునేందుకు అతను సూసైడ్​ చేసుకున్నట్టు తెలుస్తోంది.

మీరట్​లో 15ఏళ్ల బాలుడు ఆత్మహత్య..
మీరట్​లో 15ఏళ్ల బాలుడు ఆత్మహత్య..

ఉత్తర్​ప్రదేశ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది! మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తితో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

ఇదీ జరిగింది..

ఉత్తర్​ప్రదేశ్​ మీరట్​లో గత శనివారం రాత్రి జరిగింది ఈ ఘటన. కుటుంబ సభ్యుల ముందే 15 ఏళ్ల బాలుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువరాజ్ రాణా అనే బాలుడు మరణానంతర జీవితంపై కుతూహలంతో ఈ దారుణానికి ఒడిగట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు!.

“మరణం తర్వాత ఏం జరుగుతుంది?”, “మరణం  తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది?”, “గరుడ పురాణం”, “ఎలా చావాలి?” వంటివి బాలుడు ఆన్​లైన్​లో సెర్చ్​ చేశాడు. 

కాగా ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని అధికారులు ధృవీకరించారు.

కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా ఫిర్యాదు చేయలేదని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్​హెచ్ఓ) ధర్మేంద్ర కుమార్ తెలిపారు. ఈ ఘటనపై ఎస్​హెచ్ఓ కుమార్ మాట్లాడుతూ.. “బాలుడు ఆత్మహత్య చేసుకున్న చోట తుపాకీని స్వాధీనం చేసుకున్నాము. తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాము,” అని అన్నారు.

చెడు సావాసాలకు వెళుతున్నందుకు ఆ బాలుడిని తల్లి, సోదరుడు మందలించారు. అనంతరం యువరాజ్ మనస్తాపానికి గురైనట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు చెప్పారు. అతని బైక్​ని కూడా కుటుంబ సభ్యులు అమ్మేశారని, ఇది అతన్ని మరింత ఆందోళనకు గురిచేసిందని వెల్లడించారు.

పోస్ట్​మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని, తదుపరి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

సీలింగ్​ ఫ్యాన్​కి ఉరివేసుకుని..

మరో ఘటనలో ఉత్కల్ సంగీత మహావిద్యాలయకు చెందిన 12వ తరగతి విద్యార్థిని జనవరి 13న హాస్టల్ గదిలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. మృతురాలిని కేంద్రపారా జిల్లాకు చెందిన ఉత్కలికా స్వైన్​గా పోలీసులు గుర్తించారు. స్వైన్ తన గదిలో సీలింగ్ ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.

ఇంకో ఘటనలో మధ్యప్రదేశ్​లోని ఛత్తర్​పూర్ నగరంలో 26 ఏళ్ల కాలేజీ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.