Meerut murder : ‘మంచం కింద మృతదేహం, పైన..’- నేవీ ఆఫీసర్​ హత్య కేసులో సంచలన విషయాలు-meerut murder case saurabh rajputs headless body kept inside bed box wife slept on it ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Meerut Murder : ‘మంచం కింద మృతదేహం, పైన..’- నేవీ ఆఫీసర్​ హత్య కేసులో సంచలన విషయాలు

Meerut murder : ‘మంచం కింద మృతదేహం, పైన..’- నేవీ ఆఫీసర్​ హత్య కేసులో సంచలన విషయాలు

Sharath Chitturi HT Telugu

Merchant navy officer murder: మర్చెంట్​ నేవీ ఆఫీసర్​ మర్డర్​ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నిందితులు అతడిని ఎలా చంపారో పోలీసులు వివరించారు. ఇది చాలా షాకింగ్​గా ఉంది!

సౌరభ్​ రాజ్​పుట్​, ముస్కాన్​, సాహిల్​.. (HT photo)

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మర్చెంట్​ నేవీ ఆఫీసర్​ హత్య కేసు దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. యూపీ మీరట్​లో సౌర్​భ్​ రాజ్​పుట్​ని హత్య చేసినట్టు అతని భార్య ముస్కాన్​ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్​ పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. ఇందులో భాగంగానే అసలేం జరిగిందో వివరించారు.

ప్రియుడితో కలిసి భర్త దారుణ హత్య..

ముస్కాన్​ రస్తోగి- సాహిల్​లు ఒకటే స్కూల్​లో చదివారు. అయితే 2019లో వాట్సాప్​ గ్రూప్​లో స్కూల్​ ఫ్రెండ్స్​ రీ-కనెక్ట్​ అయ్యారు. వీరందరు కలిసి మీరట్​లోని ఓ మాల్​లో సెలబ్రేషన్స్​ చేసుకున్నారు. ఈ పార్టీలోనే ముస్కాన్​- సాహిల్​లు కలుసుకున్నారు. ఇది అఫైర్​కి దారి తీసింది. కానీ ముస్కాన్​కి సౌరభ్​ రాజ్​పుట్​తో వివాహం జరిగింది. కాగా.. ఉద్యోగం రిత్యా సౌరభ్​ లండన్​లో ఉండేవాడు. ఫలితంగా కొత్త అఫైర్ బాగా బలపడింది.

వీరి బంధం వెనుక డ్రగ్స్​ కోణం కూడా ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సాహిల్​ డ్రగ్స్​ తీసుకునేవాడని, ముస్కాన్​కి కూడా ఇచ్చేవాడని ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు.

ఇక తమ రిలేషన్​కి రాజ్​పుట్​ అడ్డొస్తాడని భావించి.. అతడిని చంపేయాలని ముస్కాన్​ నిర్ణయించుకుంది. ఇందుకు సాహిల్​ కూడా సాయం చేశాడు. ఇద్దరు కలిసి పక్కా ప్లాన్​ రూపొందించారు.

మార్చ్​ 3న సౌరభ్​ ఇంటికి వచ్చాడు. తనతో పాటు కోఫ్తా తీసుకొచ్చాడు. అదే సరైన సమయం అని భావించిన ముస్కాన్​.. కోఫ్తాని పెనం మీద పెట్టి వేడి చేసి, అందులో మత్తుపదార్థాలు కలిపింది. అది సౌరభ్​కి ఇచ్చింది. అది తిన్న సౌరభ్​ స్పృహ కోల్పోయాడు. వెంటనే సాహిల్​కి కాల్​ చేసింది ముస్కాన్​. ఇద్దరు కలిసి కత్తితో సౌరభ్​ని చంపేశారు. ఆ తర్వాత సౌరభ్​ మృతదేహాన్ని సాహిల్​ బాత్​రూమ్​కి తీసుకెళ్లాడు. రేజర్​తో సౌరభ్​ తల, చేతులు కోశాడు.

శరీరాన్ని ముక్కలుముక్కలుగా చేసి పాలిథీన్​ బ్యాగ్స్​లో పెట్టి, నగరం మొత్తం విసిరేయాలని ఇద్దరు ప్లాన్​ చేశారు. పాలిథీన్​ బ్యాగ్స్​లో సౌరభ్​ ఛాతిభాగం పెట్టారు. ఆ తర్వాత.. బెడ్​రూమ్​లోని డబుల్​ బెడ్​ కింద ఉన్న బాక్స్​లో ఆ బ్యాగ్స్​ పెట్టారు. ఆ రోజు రాత్రి.. కింద మృతదేహం ఉండగా, ముస్కాన్​ అదే బెడ్​పైన పడుకుంది. మరోవైపు సౌరభ్​ తల, చేతులను సాహిల్​ తన ఇంటికి తీసుకెళ్లాడు.

మర్చెంట్​ నేవీ ఆఫీసర్​ సౌరభ్​ రాజ్​పుట్​ శరీరాన్ని మాయం చేసేందుకు తొలుత వేసిన ప్లాన్​ని మార్చ్​ 5 నాటికి ఇద్దరు పక్కన పెట్టేశారు. ఘంటాగఢ్​ నుంచి డ్రమ్​ తీసుకొచ్చారు. స్థానిక మార్కెట్​లో సిమెంట్​ కొన్నారు. ముస్కాన్​ నివాసంలో సౌరభ్​ మిగిలినపోయిన అవయవాలను డ్రమ్​లో వేశారు. సాహిల్​ కూడా తాను తీసుకెళ్లిన వాటిని వెనక్కి తీసుకొచ్చి ఆ డ్రమ్​లో వేసేశాడు. ఆ తర్వాత సిమెంట్​ పోసి డ్రమ్​ని సీల్​ చేసేశారు.

సినిమాల్లో చూసి ఈ విధంగా చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సాహిల్​- ముస్కాన్​లు ప్రస్తుతం 14 రోజుల రిమాండ్​లో ఉన్నారు. మీరట్​ మర్డర్​ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మరోవైపు నిందితులకు కఠిన శిక్ష విధించాలని సర్వత్రా డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.