మర్చెంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుట్‌కు సంబంధించిన మీరట్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. భర్తను హత్య చేసిన తర్వాత ముస్కాన్ రస్తోగి, తన ప్రియుడు సాహిల్ శుక్లాతో హిమాచల్ ప్రదేశ్‌కి వెళ్లి హోలీ వేడుకలు చేసుకున్న విషయం అందరిని షాక్‌కి గురిచేసింది. ఇక ఇప్పుడు నిందితులు రిమాండ్‌లో ఉన్న జైలు నుంచి మరికొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. నిందితులు.. డ్రగ్స్ కావాలని ఏకంగా పోలీసులనే అడిగినట్టు సమాచారం. డ్రగ్స్ లేకపోతే భోజనం కూడా వద్దంటున్నారని తెలుస్తోంది. వీరిద్దరు తీవ్రమైన డ్రగ్ అడిక్షన్ సమస్యతో బాధపడుతున్నట్టు ఇది స్పష్టం చేస్తోంది.
ఈ నెల 4న ముస్కాన్, ప్రియుడు సాహిల్‌తో కలిసి, తన భర్త సౌరభ్‌ను కత్తితో పొడిచి చంపి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచి సిమెంట్‌తో నింపింది. ఆ తర్వాత ప్రేమికులు హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. మీరట్‌లో అసలేం జరగనట్టు.. వేడుకల్లో ఎంజాయ్ చేశారు. లగ్జరీగా బతికారు. చివరికి డబ్బులు అయిపోవడంతో మార్చ్ 17న మీరట్‌కు తిరిగి వచ్చారు.
మర్చెంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుట్ హత్య బయటపడిన తర్వాత ముస్కాన్, సాహిల్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పుడు 27 ఏళ్ల నిందితులిద్దరూ మీరట్ జిల్లా జైలులో వేర్వేరు బ్యారక్‌లలో ఉన్నారు. డ్రగ్స్‌పై వారు ఆధారపడటం తీవ్రంగా ఉందని, వారిని వారు హాని కలిగించుకోకుండా, ఇతరులకు హాని చేయకుండా తగిన చర్యలు చేపట్టామని ఓ అధికారి చెప్పారు.
జైలులోకు వెళ్లిన తొలిరాత్రి నుంచే ముస్కాన్ ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు తీవ్రమైన మాదకద్రవ్యాల వ్యసనం ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ముస్కాన్‌కి అత్యవసర చికిత్స ప్రారంభించారు.
ఇంతలో సాహిల్ హంగామా సృష్టించి తనకు డ్రగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గంజాయి కావాలని హడావుడి చేశాడు. ముస్కాన్ కూడా తనకు మార్ఫిన్ ఇంజెక్షన్లు కావాలని డిమాండ్ చేసిందని అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి.
వీరిద్దరూ క్రమం తప్పకుండా ఇంజెక్టెబుల్ డ్రగ్స్ వాడుతున్నారని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు ధృవీకరించారు.
మీరట్ జైలులో డీ-అడిక్షన్ సెంటర్ ఉంది. ప్రస్తుతం మీరట్ హత్య కేసు నిందితులు ఇద్దరు అందులోనే ఉన్నారు. వారి పరిస్థితిని మెరుగుపరిచేందుకు అక్కడ చికిత్స ఇస్తున్నారు. జైలుకు చెందిన వైద్య సిబ్బంది కూడా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
ముస్కాన్, సాహిల్ నుంచి మాదకద్రవ్యాల కోసం తీవ్రమైన డిమాండ్ల మధ్య, ఇద్దరూ ఆహారాన్ని తిరస్కరించారని, ఇది విత్డ్రావెల్కి సాధారణ సంకేతమని వర్గాలు తెలిపాయి. ఇద్దరూ కొంత స్థిరత్వాన్ని తిరిగి పొందడానికి కనీసం పది రోజులు పట్టే అవకాశం ఉందని వారు వెల్లడించారు.
మీరట్ హత్య కేసు దేశవ్యప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
సంబంధిత కథనం