Measles epidemic: ముంబైలో మీజిల్స్(measles) కేసులు పెరుగుతున్నాయి. ఈ మీజిల్స్ measles) నే తట్టు, అమ్మవారు అంటారు. ఇది వైరస్ ద్వారా సోకుతుంది. పెద్ద ఎత్తున టీకాలను వేస్తున్నప్పటికీ.. ఈ వ్యాధికి సంబంధించిన కేసుల సంఖ్య పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. పిల్లలో తీవ్రమైన జ్వరం, దగ్గు, చర్మంపై ఎరుపురంగులో దద్దుర్లు, ముక్కు నుంచి, కళ్ల నుంచి నీరు కారడం.. మొదలైనవి ఈ మీజిల్స్ లక్షణాలు.,Measles epidemic: 500 దాటిన కేసులుతాజాగా నమోదైన 9 కేసులతో కలిపి, ఇప్పటివరకు ముంబైలో మొత్తం 505 మీజిల్స్(measles) కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ వ్యాధితో ఇప్పటివరకు ఎవరూ చనిపోలేదని బీఎంసీ (Birhanmumbai Municipal Corportation BMC) వర్గాలు తెలిపాయి. బుధవారం మీజిల్స్(measles) సంబంధిత లక్షణాలతో 36 మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరారని వెల్లడించాయి. వారిలో9 మందికి ఈ వ్యాధినిర్ధారణ అయిందని తెలిపాయి. బీఎంసీ ఇప్పటికే మీజిల్స్(measles) ను ముంబైలో ఎపిడమిక్ (epidemic) గా ప్రకటించింది.,Measles epidemic: యుద్ధ ప్రాతిదికన టీకాలు..మీజిల్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన మీజిల్స్ రుబెల్లా టీకాను(measles-rubella vaccine) వేస్తున్నారు. ఇప్పటివరకు 9 నెలల నుంచి 6 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న 65 వేల మంది పిల్లలకు ఈ టీకా వేశామని బీఎంసీ వెల్లడించింది. ఈ తట్టు వ్యాధి సోకే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించి టీకాలు వేస్తున్నామని తెలిపింది. ప్రతీ ఇంటికి వెళ్లి పరీక్షలు జరుపుతున్నామని తెలిపింది.