Teacher beaten by students `మార్క్స్ తక్కువేశారని టీచర్‌ను కట్టేసి కొట్టారు`
Teacher beaten by students : మ్యాథ్స్ పరీక్షలో తక్కువ మార్క్స్ వేసి ఫెయిల్ చేశారని టీచర్‌పై ఈ విధంగా పగ తీర్చుకున్నారు జార్ఖండ్‌లోని ఒక ప్రభుత్వ ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు.
మార్క్స్ తక్కువ వేసి ఫెయిల్ చేశారన్న కోపంతో విద్యార్థులు గణితశాస్త్ర అధ్యాపకుడిని, స్కూల్ క్లర్క్‌ను స్కూల్ ఆవరణలోని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాలలోని మెజారిటీ విద్యార్థులు పాల్గొనడం విశేషం.

Teacher beaten by students : జార్ఖండ్‌లో..
జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో ఉన్న గోపికందార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాథ్స్ పరీక్షలో ఫెయిల్ చేశారన్న కోపంతో ఆ సబ్జెక్ట్ టీచర్ సుమన్ కుమార్‌ను, ఆ మార్క్స్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన స్కూల్ క్లర్క్ సోనేరామ్‌ను స్కూల్ ఆవరణలో ఉన్న చెట్టుకు కట్టి దారుణంగా కొట్టారు. అయితే, ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం కానీ, బాధిత టీచర్, క్లర్క్ కానీ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.
Teacher beaten by students : డీడీ గ్రేడ్
జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్ నిర్వహించిన పరీక్షలో .. మ్యాథ్య్ సబ్జెక్టులో ఈ పాఠశాలలోని 9వ తరగతిలో ఉన్న 32 మంది విద్యార్థుల్లో 11 మందికి `డీడీ` గ్రేడ్ వచ్చింది. ఈ డబుల్ డీ గ్రేడ్ అంటే ఫెయిల్ అనే అర్థం. దాంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు గణితం టీచర్‌పై ఇలా దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ ఘటనపై ఆరా తీయడానికి వెళ్లిన పోలీసులకు స్కూల్ యాజమాన్యం ఎలాంటి ఫిర్యాదు ఇవ్వడానికి ఆసక్తి చూపలేదు. ఫిర్యాదు చేస్తే.. ఆ విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని పోలీసులకు వివరించింది. బాధిత టీచర్, క్లర్క్ కూడా ఫిర్యాదు ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ ఘటన అనంతరం బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అనంత్ ఝా స్కూల్‌కు వెళ్లి కారణాలను ఆరా తీశారు. ఆ తరువాత, పాఠశాలలోని 9, 10వ తరగతి విద్యార్థులకు వారం పాటు సెలవులు ఇచ్చి ఇళ్లకు పంపించేశారు.
Teacher beaten by students : బాధిత టీచర్ గతంలో హెడ్ మాస్టర్
విద్యార్థులు కొట్టిన బాధిత టీచర్ సుమన్ కుమార్ గతంలో అదే పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఆ తరువాత ఇతర టీచర్ల ఫిర్యాదు మేరకు ఆయనను ఆ హోదా నుంచి తొలగించారు. అందువల్ల ఈ ఘటన వెనుక ఆ స్కూల్‌లోని టీచర్ల మధ్య ఉన్న విబేధాలు, ఇతర రాజకీయాలు కూడా కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.