Bhanzu funding : 'భాన్జు'లో రూ. 120కోట్ల పెట్టుబడులు!-math learning platform bhanzu secures usd 15 million ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Math Learning Platform Bhanzu Secures Usd 15 Million

Bhanzu funding : 'భాన్జు'లో రూ. 120కోట్ల పెట్టుబడులు!

Sharath Chitturi HT Telugu
Sep 23, 2022 08:46 AM IST

Bhanzu fund raising : భాన్జుకు 15మిలియన్​ డాలర్ల పెట్టుబడి లభించింది. గణితాన్ని భారతీయులకు మరింత చేరువ చేసేందుకు ఈ పెట్టుబడులను ఉపయోగించనుంది భాన్జు.

భాన్జు
భాన్జు

Bhanzu funding : హైదరాబాద్​కు చెందిన అంతర్జాతీయ గణిత (మ్యాథ్‌) అభ్యాస వేదిక భాన్జుకు 15మిలియన్​ డాలర్ల(రూ. 120కోట్లు) సిరీస్​ ఏ ఫండింగ్​ లభించింది. ఈ రౌండ్‌ ఫండ్‌కు అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ, 8 రోడ్స్‌ వెంచర్స్‌ నేతృత్వం వహించింది. ఇందులో మరో అంతర్జాతీయ ఇన్వెస్టర్‌ సంస్థ బీ క్యాపిటల్‌ కూడా పెట్టుబడులు పెట్టింది. 

ట్రెండింగ్ వార్తలు

పెట్టుబడుల ద్వారా సమీకరించిన నిధులను సంస్థ సాంకేతిక మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడం సహా అసాధారణ విద్యార్థి అభ్యాస అనుభవాలను సృష్టించేందుకు, ఫలితాలను లక్ష్యంగా చేసుకున్న కంటెంట్‌ను తమ మ్యాథ్‌ కరిక్యులమ్‌ను బలోపేతం చేసేందుకు వినియోగించనుంది భాన్జు తెలిపింది.

2020లో.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హ్యూమన్‌ కాలిక్యులేటర్‌గా గుర్తింపుపొందింది ఈ సంస్థ. భాన్జును నీలకంఠ భాను ప్రకాష్‌ ప్రారంభించారు.

Bhanzu founder Bhanu : భాన్జు వ్యవస్థాపకుడు, సీఈవో నీలకంఠ భాను.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. శకుంతల దేవీ.. మ్యాథ్‌ రికార్డ్‌లను సైతం ఆయన బద్దలుకొట్టారు. 2020లో యావత్‌ దేశానికి గర్వకారణంగా నిలుస్తూ.. మైండ్‌ స్పోర్ట్స్‌ ఒలింపిక్స్‌లో భారతదేశం తరపున మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌ను సాధించారు. ఆ తరువాతే, భాన్జును భాను ప్రారంభించారు. ఇది ఒక గణిత అభ్యాస వేదిక. గణితమంటే ఉన్న భయాన్ని పోగొట్టే దిశగా ఇది కృషి చేస్తుంది.

"సరైన అభ్యాస పద్ధతులతో గణితాన్ని అభ్యసించే సామర్థ్యం మన దేశంలో ప్రతి చిన్నారికీ ఉంది. ఇది నేను నమ్ముతున్నాను. నా గణిత పాఠ్యాంశాలు, విద్యార్థులకు మ్యాథ్​పై ఉన్న భయాన్ని పొగొట్టడంతో పాటుగా సైన్స్‌, ఇంజినీరింగ్‌ వంటి రంగాల్లో కెరీర్‌లను ఎంచుకునేలా వారికి స్ఫూర్తినిస్తాను. భారతదేశంలో ఆర్యభట్ట మొదలు రామానుజన్‌ నుంచి శకుంతల దేవి వరకూ గణిత మేధావులు ఎందరో ఉన్నారు. భారతీయులు తమ అసలైన సామర్థ్యం గుర్తించేలా చేయాలని భాన్జు కోరుకుంటుంది. ఈ లక్ష్యం సాధించడానికి అత్యుత్తమ సామర్థ్యం మ్యాథ్​కు ఉంది. భాన్జు గణిత కోర్సులతో, ప్రతి విద్యార్థి సరైన మార్గంలో గణితం అభ్యసించడం ప్రారంభించడం మాత్రమే కాదు , ఆ గణితాన్ని అభిమానిస్తారు," అని అన్నారు.

ఈ కంపెనీ 6 నుంచి 16 సంవత్సరాల లోపు స్టూడెంట్స్​కి మ్యాథ్​లో అభ్యాస కార్యక్రమాలను అందిస్తుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం