Jonathan Majors arrested : గర్ల్‌ఫ్రెండ్‌పై దాడి.. మార్వెల్ స్టార్ అరెస్ట్!
Jonathan Majors arrested : మార్వెల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హాలీవుడ్ నటుడు జొనాథన్ మేజర్స్ అరెస్ట్ అయ్యాడు. గర్ల్‌ఫ్రెండ్‌పై దాడి చేయడమే ఇందుకు కారణం.
Jonathan Majors girlfriend : క్రీడ్-3, యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటిమేనియాలో నటించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు జొనాథన్ మేజర్స్‌ను పోలీసులు న్యూయార్క్ మానహాట్టన్లో అరెస్ట్ చేశారు. గర్ల్‌ఫ్రెండ్ గొంతు నులమడం, దాడి చేయడం, వేధించడం వంటి ఆరోపణలతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే..!
స్థానిక కాలమానం ప్రకారం.. 30ఏళ్ల మహిళ నుంచి 911కు శనివారం ఉదయం కాల్ వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. చెల్సియాలోని 22 స్ట్రీట్, 8 ఎవెన్యూలోని అపార్ట్మెంట్ వద్దకు వెళ్లారు. అక్కడే జొనాథన్ మేజర్స్‌ను శనివారం ఉదయం 11:15 ప్రాంతంలో అరెస్ట్ చేశారు. మహిళ మెడ, తలపై స్వల్ప గాయాలయ్యాయి. ఆమెను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వివరించారు.
Jonathan Majors arrested : పోలీసులకు మహిళ చెప్పిన సమాచారం ప్రకారం.. జొనాథన్ మేజర్స్తో కలిసి తను బ్రూక్లిన్‌లోని ఓ బార్‌కు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ట్యాక్సీలో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఇంటికి వెళ్లిన అనంతరం.. మహిళపై హాలీవుడ్ నటుడు దాడి చేశాడు. గాయాలయ్యేంతగా కొట్టాడు.
గొడవకు కారణం అదే..
జొనాథన్ మేజర్స్.. కొంత కాలంగా వేరే మహిళకు మెసేజ్ చేస్తున్నట్టు ఆ మహిళకు అనుమానాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆమె డైరక్ట్‌గా చూసింది కూడా! ఇదే విషయంపై ట్యాక్సీలో నటుడిని నిలదీసింది. ఈ క్రమంలో జొనాథన్ మేజర్స్కు కోపం వచ్చింది. ఇంటికి వెళ్లిన అనంతరం.. ఆమె చెయ్యి పట్టుకుని చెంప చెళ్లుమనిపించాడు. ఆ సమయంలోనే గొంతు నులిమాడు.
Jonathan Majors latest news : ఈ వ్యవహారంలో జొనాథన్ మేజర్స్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడిని జైలుకు తరలించారు. కాగా శనివారం రాత్రి అతను జైలు నుంచి విడుదలైనట్టు తెలుస్తోంది. మరోవైపు ఇందులో జొనాథన్ తప్పు లేదని అతని ప్రతినిధి చెబుతున్నారు. "జొనాథన్ తప్పు లేదు. ఈ వ్యవహారం నుంచి అతడిని బయటకు తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నాము," అని వివరించారు.
రెండు వారాల క్రితం జరిగిన ఆస్కార్స్ వేడుకల్లో మెరిశాడు జొనాథన్ మేజర్స్. మళ్లీ ఇప్పుడు.. ఈ ఘటనతో వార్తలకెక్కాడు. మార్వెల్ స్టార్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు తమ వద్ద సరిపడా ఆధారాలు ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
సంబంధిత కథనం