March 2024 festivals list:మార్చి నెల ప్రారంభమైంది. ఈ నెలలో అనేక పండుగలు ఉన్నాయి. మార్చి నెల సాధారణంగా శీతాకాలం ముగింపును ప్రకటిస్తుంది. వసంత రుతువుకు స్వాగతం పలుకుతుంది. మార్చి మాసంలో రకరకాల పండుగలు వస్తాయి. మహాశివరాత్రి, హోలీ ఈ నెలలోనే ఉంటాయి. పవిత్ర రంజాన్ మాసం ఈ నెలలోనే ప్రారంభం అవుతుంది. అయితే సౌదీ అరేబియాలో చంద్రుడు దర్శనం ఆధారంగా రంజాన్ మాసం ప్రారంభమయ్యే ఖచ్చితమైన తేదీని నిర్ణయిస్తారు.
మార్చి నెల మొదటి వారంలో యశోద జయంతి, భాను సప్తమి, శబరి జయంతి, కలష్టమి, జానకి జయంతి, విజయ ఏకాదశి జరుపుకుంటారు. మార్చి రెండవ వారం మహా శివరాత్రికే అంకితం. శివ భక్తులు జరుపుకునే అతిపెద్ద పండుగలలో మహా శివరాత్రి ఒకటి. మార్చి మూడవ వారాన్ని హోలాష్టక్ గా జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం ఈ కాలాన్ని అశుభంగా భావిస్తారు. ఈ సమయంలో విష్ణు భక్తుడైన భక్త ప్రహ్లాదుడిని చిత్రహింసలకు గురిచేశారని ప్రతీతి. మార్చి 25న రంగుల పండుగ హోలీ వస్తుంది. మార్చి 24న హోలికా దహన్ గా, మార్చి 25న దేశవ్యాప్తంగా హోలీ వేడుకలను జరుపుకోనున్నారు. మార్చి నెల రంగా పంచమి వేడుకలతో ముగుస్తుంది. ఫాల్గుణ కృష్ణ పక్ష పంచమి నాడు జరుపుకునే ఈ పండుగను ఈ ఏడాది మార్చి 30న జరుపుకోనున్నారు.
మార్చి 2 - యశోద జయంతి
మార్చి 3 - భాను షప్తమి, శబరి జయంతి, కాలాష్టమి, మాసిక్ కృష్ణ జన్మాష్టమి
మార్చి 4 - జానకి జయంతి
మార్చి 5 - మహర్షి దయానంద్ సరస్వతి జయంతి
మార్చి 6 - విజయ ఏకాదశి
మార్చి 7 - వైష్ణవ విజయ ఏకాదశి
మార్చి 8 - మహా శివరాత్రి, ప్రదోష వ్రతం, మాస శివరాత్రి
మార్చి 8- అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మార్చి 9 - అన్వధన్
మార్చి 10 - దర్శ అమావాస్య
మార్చి 11- చంద్ర దర్శన్
మార్చి 12 - ఫూలేరా దూజ్, రామకృష్ణ జయంతి
మార్చి 13 - వినాయక చవితి
మార్చి 14 - మాసిక్ కార్తీకై, కరదయాన్ నోంబు
మార్చి 15 - స్కంద షష్టి
మార్చి 16 - రోహిణి వ్రతం ఫాల్గుణ, అష్టాహ్నిక ప్రారంభం
మార్చి 17 - మాసిక్ దుర్గాష్టమి
మార్చి 20 - అమలాకి ఏకాదశి
మార్చి 21 - నరసింహ ద్వాదశి
మార్చి 22 - ప్రదోశ వ్రతం
మార్చి 24 - చోటీ హోలీ, హోలీ కా దహన్, ఫాల్గున పౌర్ణమి వ్రతం
మార్చి 25- హోలీ
మార్చి 26 - చైత్ర ప్రారంభం, ఇష్టి
మార్చి 27 - భాయ్ దూజ్, భ్రాత్రి ద్వితియా
మార్చి 28 - బాలచంద్ర సంకష్టి చతుర్థి, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి
మార్చి 30 - రంగ పంచమి
టాపిక్