Hidma killed in C'garh encounter?:మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం?-maoist top leader plga commander hidma killed in chattis garh encounter ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hidma Killed In C'garh Encounter?:మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం?

Hidma killed in C'garh encounter?:మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం?

HT Telugu Desk HT Telugu
Jan 11, 2023 08:16 PM IST

చత్తీస్ గఢ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు, PLGA ( పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) కమాండర్ హిడ్మా హతమైనట్లు సమాచారం.

మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా

చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ అడవుల్లో బుధవారం తెల్లవారు జామున జరిగిన ఎన్ కౌంటర్ ల మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పీఎల్‌జీఏ ( పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) కమాండర్ హిడ్మా(HIDMA) చనిపోయినట్లు తెలుస్తోంది. బీజాపూర్‌- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ ఎన్ కౌంటర్ లో భద్రతబలగాలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటించారు. తెలంగాణ గ్రేహౌండ్స్‌, సీఆర్పీఎఫ్‌(CRPF) కోబ్రా సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. అయితే, హిడ్మా మరణంపై భద్రత దళాలు కానీ, మావోలు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

అనతి కాలంలోనే అగ్ర స్థాయికి..

మావోయిస్టు పార్టీలో హిడ్మా (HIDMA) అత్యంత చిన్న వయస్సులోనే ఉన్నత స్థానానికి చేరుకున్నారు. సాధారణంగా కేంద్ర కమిటీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అధికంగా ఉంటారు. చిన్న వయస్సులోనే కేంద్ర కమిటీలో స్థానం సంపాదించిన కొద్ది మందిలో హిడ్మా ఒకరు. హిడ్మా వయస్సు 43 ఏళ్లుగా భావిస్తున్నారు. అలాగే, భద్రతాబలగాలను సమర్ధవంతంగాఎదుర్కోవడంలో హిడ్మా (Hidma) నేతృత్వంలోని పీఎల్జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) అనేక సందర్భాల్లో విజయవంతమైంది. సుక్మా అటవీ ప్రాంతం వాడు కావడంతో స్థానిక భౌగోళిక పరిస్థితుల పట్ల హిడ్మాకు మంచి అవగాహన ఉంది. అలాగే, స్థానికుల నుంచి సమాచారం, సహకారం కూడా అందేది.

ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్

మావోయిస్ట్ ల్లో హిడ్మాను ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేర్కొంటుంటారు. 43 ఏళ్ల వయసు, సన్నగా ఉండే హిడ్మా, దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో అత్యధిక సంఖ్యలో పోలీసులను హతమార్చాడు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం స్థానికుడయిన హిడ్మా అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. 1996-97 ప్రాంతంలో తన 17వ ఏట మావోయిస్టు పార్టీలో చేరారు మడావి హిడ్మా. ఆయనకు హిద్మల్లు, సంతోష్‌ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. హిడ్మా పాల్గొన్న ఎన్ కౌంటర్లలో మావోల కన్నా.. పోలీసుల ప్రాణాలే ఎక్కువగా పోయేవని చెబుతుంటారు. పోలీసుల నుంచి స్వాధీనం చేసుకున్న అత్యాధునిక ఆయుధాలను, వారి బుల్లెట్ ప్రూఫ్ దుస్తులను హిడ్మా నాయకత్వంలోని పీఎల్జీఏ దళం వినియోగించేది.

హిట్ లిస్ట్ లో..

చదివింది మాత్రం 7వ తరగతే అయినా మావోయిస్టు సాయుధ విభాగం పీఎల్‌జీఏ ( పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)లో కీలక నేతగా ఎదిగాడు హిడ్మా. అటవీ ప్రాంతంలో పోలీసులను, సీఆర్పీఎఫ్‌ జవాన్లను టార్గెట్‌ చేయడంలో హిడ్మా వ్యూహాలు చాలా సార్లు సక్సెస్‌ కావడంతో.. హిట్‌ లిస్టులో ఉన్నాడు. ఉర్పల్‌ మెట్లలో 2007లో జరిగిన 24మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు, తాడిమెట్లలో 2011లో జరిగిన దాడిలో 76 మంది జవాన్లు, 2017లో 12 మంది జవాన్లు మృతి చెందిన ఘటనల్లో హిడ్మా కీలక పాత్ర పోషించాడు. హిడ్మాపై 45 లక్షల రూపాయల రివార్డు ఉంది.

టాపిక్