Video: విద్యార్థిని ‘ఉగ్రవాది’తో పోల్చిన ప్రొఫెసర్.. దీటుగా సమాధానం చెప్పిన స్టూడెంట్-manipal institute of technology professor compare student with a terrorist viral video ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Manipal Institute Of Technology Professor Compare Student With A Terrorist Viral Video

Video: విద్యార్థిని ‘ఉగ్రవాది’తో పోల్చిన ప్రొఫెసర్.. దీటుగా సమాధానం చెప్పిన స్టూడెంట్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 28, 2022 07:30 PM IST

Manipal Institute 'terrorist row': విద్యార్థిని ఉగ్రవాదితో పోల్చారు ఓ అధ్యాపకుడు. ఆయనకు ఆ స్టూడెంట్ దీటుగా బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍ అయింది.

Video: విద్యార్థిని ‘ఉగ్రవాది’తో పోల్చిన ప్రొఫెసర్.. దీటుగా సమాధానం చెప్పిన స్టూడెంట్ (From a screengrab of viral video)
Video: విద్యార్థిని ‘ఉగ్రవాది’తో పోల్చిన ప్రొఫెసర్.. దీటుగా సమాధానం చెప్పిన స్టూడెంట్ (From a screengrab of viral video)

Professor compares student with a terrorist: స్టూడెంట్‍ను ఉగ్రవాదితో పోల్చారు ఓ ప్రొఫెసర్. తరగతి గదిలోనే విద్యార్థి పేరు అడిగి మరీ ఇలా చేశారు. దీంతో ఆ స్టూడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ మాటలకు గట్టిగా సమాధానం చెప్పారు. దీంతో ఆ అధ్యాపకుడు.. క్షమాపణ చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో.. వైరల్ అయింది. మొత్తంగా ఆ ప్రొఫెసర్‍పై ఆ విద్యాసంస్థ చర్యలు చేపట్టింది. తనను టెర్రరిస్ట్ తో పోల్చిన ప్రొఫెసర్‌కు ఆ విద్యార్థి ఎలా సమాధానం చెప్పారంటే..

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది

Professor compares student with a terrorist: కర్ణాటక ఉడిపిలోని మణిపాల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈ ఘటన జరిగింది. ఓ విద్యార్థిని పేరు అడిగారు ప్రొఫెసర్. ఆ ముస్లిం విద్యార్థి తన పేరు చెప్పారు. అప్పుడు ప్రొఫెసర్.. “ఓ.. నువ్వు కసబ్ లాంటి వాడివా” అని అన్నారు. 26/11 ముంబై దాడులకు పాల్పడి.. సజీవంగా పట్టుబడిన పాకిస్థాన్ టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్. అతడితో విద్యార్థిని పోల్చారు ఆ ప్రొఫెసర్. దీనికి ఆ స్టూడెంట్ గట్టిగా సమాధానం ఇచ్చారు. తాను సరదాగా ఈ వ్యాఖ్యలు చేశానంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు అధ్యాపకుడు. దీంతో ఆ విద్యార్థి మరింత ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు.

26/11 ఫన్నీ కాదు

“26/11 ఫన్నీ (సరదా) కాదు. ఈ దేశంలో ముస్లింగా ఉంటూ.. ఇలాంటివి ఎదుర్కోవడం ఫన్నీ కాదు. నా మతం గురించి మీరు జోక్ చేయకూడదు. అది కూడా ఇంత అవమానకర రీతిలో ప్రవర్తించకూడదు. ఇది సరదా కాదు సర్, అసలు కాదు” అని ఆ విద్యార్థి ఆవేదనతో గట్టిగా సమాధానం చెప్పారు.

“ నువ్వు నా కుమారుడి లాంటి వాడివి” అని ఆ ప్రొఫెసర్ అన్నారు. “మీ కుమారుడితో ఇలానే మాట్లాడతారా? టెర్రరిస్ట్ పేరుతో అతడిని మీరు పిలుస్తారా?. ఇంత మంది ముందు నన్ను అలా ఎలా అంటారు? మీరు ఓ ఫ్రొఫెషనల్. మీరు టీచింగ్ చేస్తున్నారు. ఒక్క క్షమాపణతో మీ ఆలోచనా విధానం ఎలా మారుతుంది” అని ఆ విద్యార్థి ప్రశ్నించారు. ఆ తర్వాత ఆ విద్యార్థిని ప్రొఫెసర్ క్షమాపణ కోరారు.

ప్రొఫెసర్‌పై చర్యలు

విద్యార్థిని ఉగ్రవాదితో పోల్చిన ప్రొఫెసర్ పై మణిపాల్ ఇన్‍స్టిట్యూట్ చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేసినట్టు వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్టు తెలిపింది.

IPL_Entry_Point

టాపిక్