Man urinates on dalit : దళితుడి చెవిలో మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్​!-man urinates on dalit friends ear after fight in uttar pradesh ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Man Urinates On Dalit : దళితుడి చెవిలో మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్​!

Man urinates on dalit : దళితుడి చెవిలో మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్​!

Sharath Chitturi HT Telugu

Man urinates on dalit : దళితుడి చెవిలో ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లో చోటుచేసుకుంది.

దళితుడి చెవిలో మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్​!

Man urinates on dalit in Uttar Pradesh : ఉత్తర్​ ప్రదేశ్​లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దళితుడి చెవిలో మరో వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు! ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

ఇదీ జరిగింది..

ఉత్తర్​ ప్రదేశ్​ సోన్​భాద్ర జిల్లాలోని జుగైల్​ ప్రాంతంలో ఈ నెల 11న జరిగింది ఈ ఘటన. బాధితుడు, నిందితుడు స్నేహితులని తెలుస్తోంది. కాగా.. వారిద్దరు మద్యం సేవించారని, ఆ తర్వాత ఓ విషయంపై గొడవ మొదలైందని సమాచారం. గొడవ తీవ్రరూపం దాల్చడంతో.. జవహర్​ పటేల్​ అనే వ్యక్తి, గులాబ్​ కోల్​ అనే దళితుడిపై దాడి చేశాడు. చివరికి, కిందపడేసి, అతని చెవిలో మూత్ర విసర్జన చేశాడు.

మద్యం మత్తులో నిందితుడు ఈ అమానవీయ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. దూరం నుంచి ఈ దృశ్యాలను చిత్రీకరించిన ఓ వ్యక్తి, వాటిని సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు. అవి వైరల్​ అయ్యాయి.

ఇదీ చూడండి:- Man defecates in Air India : విమానం మధ్యలో మలవిసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్​

మరోవైపు కొన్ని గంటల తర్వాత.. గులాబ్​ కోల్​ పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పటేల్​తో పాటు మరో వ్యక్తిని అరెస్ట్​ చేశారు.

అమానవీయ ఘటనలు..

మనుషులపై మూత్ర విసర్జన చేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో ఉంటున్నాయి. మధ్యప్రదేశ్​లో పరేశ్​ శుక్లా అనే వ్యక్తి, ఓ ఆదివాసి సమాజానికి చెందిన వ్యక్తిపై మూత్రవిసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేయగా.. బాధితుడి వద్దకు వెళ్లిన సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​, అతని కళ్లు కడిగారు. ఈ దృశ్యాలు వైరల్​ అయ్యాయి.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.