Man defecates in Air India : విమానం మధ్యలో మలవిసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్
Man defecates in Air India : ముంబై- దిల్లీ ఎయిర్ ఇండియాలో ప్రయాణించిన ఓ వ్యక్తి.. విమానం మధ్యలో మలవిసర్జన చేశాడు. ఈ ఘటన ఈ నెల 24న జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.
Man defecates in Air India : ఎయిర్ ఇండియా విమానం ఫ్లోర్‌పై ఓ వ్యక్తి మలవిసర్జన, మూత్రవిసర్జన చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 24న ఏఐసీ 866 విమానం ముంబై నుంచి దిల్లీ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది..
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. నిందితుడి పేరు రామ్ సింగ్. సీట్ నెంబర్ 17ఎఫ్‌లో కూర్చున్న రామ్ సింగ్.. విమానం గాలిలో ఎగిరిన తర్వాత 9 రోలో మలవిసర్జనతో పాటు మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటనలో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
రామ్ సింగ్ ప్రవర్తనను గమనించిన ఎయిర్ ఇండియా సిబ్బంది.. అతనికి మాటలతో వార్నింగ్ ఇచ్చింది. అనంతరం తోటి ప్రయాణికులకు దూరంగా అతడిని కూర్చోబెట్టింది.
మరోవైపు.. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పైలట్.. సంస్థకు వెంటనే పూర్తి వివరాలను అందించాడు. విమానాశ్రయానికి కూడా సమాచారం అందించాడు. ల్యాండింగ్ జరిగిన వెంటనే సంబంధిత వ్యక్తిపై చర్యలు చేపట్టే విధంగా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశాడు.
రామ్ సింగ్‌పై ఐపీసీ సెక్షన్ 294, 510 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
నవంబర్‌లో ఇలా..
విమానాల్లో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్న ఈ తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నాయి. 2022 నవంబర్ 26న.. ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మద్యం మత్తులో అతను ఈ విధంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై సరిగ్గా స్పందించలేదని ఎయిర్ ఇండియాపైనా ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత.. పారిస్ - దిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో ఓ వ్యక్తి, తోటి ప్రయాణికురాలి బ్లాంకెట్‌పై మూత్ర విసర్జన చేశాడు.
సంబంధిత కథనం