Viral | ఓలా స్కూటర్​ను గాడిదకు కట్టి రోడ్ల మీద ఊరేగింపు-man ties ola scooter to donkey and parades it ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Man Ties Ola Scooter To Donkey And Parades It

Viral | ఓలా స్కూటర్​ను గాడిదకు కట్టి రోడ్ల మీద ఊరేగింపు

HT Telugu Desk HT Telugu
Apr 25, 2022 08:42 PM IST

మహారాష్ట్ర: కొనుగోలు చేసిన ఆరు రోజులకే అతడి ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ పనిచేయడం మానేసింది. కంపెనీకి ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. సహనాన్ని కోల్పోయిన అతడు.. ఓలా స్కూటర్​ను గాడిదకు కట్టి రోడ్లు మీద ఊరేగించాడు. పాలీ పట్టణంలో జరిగింది ఈ ఘటన.

ఓలా స్కూటర్​ను గాడిదకు కట్టి ఊరేగింపు..
ఓలా స్కూటర్​ను గాడిదకు కట్టి ఊరేగింపు.. (letsupp.marathi/instagram)

Ola scooter donkey | మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి.. తనకు వచ్చిన సమస్యపై వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ఓలా స్కూటర్​ను గాడిదకు కట్టి ఊరేగించాడు.

ట్రెండింగ్ వార్తలు

కారణం ఏంటంటే..

బీడ్​​ జిల్లాకు చెందిన సచిన్​ గిట్టే.. 2021 సెప్టెంబర్​లో.. ఓలా సంస్థ నుంచి ఓ ఎలక్ట్రిక్​ ద్విచక్ర వాహనాన్ని బుక్​ చేసుకున్నాడు. 2022 మార్చ్​ 24న డెలివరీ అందింది. కానీ కొన్న ఆరు రోజులకే అది పనిచేయడం మానేసింది. ఈ విషయంపై ఓలా కంపెనీని ఆయన సంప్రదించాడు. ఓ మెకానిక్​ వచ్చి స్కూటర్​ను చూసి వెళ్లాడు. అంతే! ఓలా నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. కస్టమర్​ కేర్​కు ఎన్నిసార్లు ఫోన్​ చేసినా లాభం లేకుండాపోయింది. పైగా.. వారందరు తమ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదలుపెట్టారు.

సచిన్​ గిట్టేకు కోపం వచ్చింది. ఫలితంగా.. ఓలా స్కూటర్​ను గాడిదకు కట్టాడు. పార్లీ పట్టణం రోడ్ల మీద ఊరేగించాడు. వాటికి బ్యానర్లు కూడా తగిలించాడు. 'ఓలాను నమ్మకండి. ఓలా వాహనాలు కొనకండి. మోసపోకండి,' అంటూ రాసుకొచ్చాడు.

సచిన్​ గిట్టే.. కన్జ్యూమర్​ ఫోరంను సైతం సంప్రదించినట్టు తెలుస్తోంది. బైక్​ రిపేరు చేయించలేదని వాపోయాడు. ఓలా సంస్థపై దర్యాప్తు చేపట్టి.. ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

ఈ దృశ్యాలను స్థానిక వార్తా సంస్థ.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసింది. అవి కాస్త వెంటనే వైరల్​గా మారాయి.

వాహనాలకు మంటలు.. ఓలా చర్యలు..

Ola electric scooter | లక్ట్రిక్​ వాహనాలకు మంటలు అంటుకుంటున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. ఆయా ఘటనల్లో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. తాజాగా.. ఈ వ్యవహారంపై ఓలా చర్యలు చేపట్టింది. తమ సంస్థ రూపొందించిన 1,441 ఎలక్ట్రిక్​ ద్విచక్ర వాహనాలను వెనక్కి పిలిపించనుంది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేసింది.

పుణెలో గత నెల 26న జరిగిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్​ వాహనాలను వెనక్కి తీసుకుంటున్నామని ఓలా ఎలక్ట్రిక్​ వెల్లడించింది.

"పుణెలోని ఓ ఎలక్ట్రిక్​ వాహనానికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. అయితే మా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్​ వాహనం ప్రమాదానికి గురైన ఘటన ఇదొక్కటే అని తెలుస్తోంది. అయినప్పటికీ.. 1,441 వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నాము. వాటి భద్రత, ఇతర ప్రమాణాలను మరోమారు పరిశీలిస్తాము. మా సర్వీసు ఇంజనీర్లు ఆ పని చూసుకుంటారు. బ్యాటరీ, థర్మల్​, సెఫ్టీ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు," అని ఓలా ఎలక్ట్రిక్​ తెలిపింది.

Ola Electric | దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్​ వాహనాలకు నిప్పంటుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక సంస్థలు తమ ఎలక్ట్రిక్​ వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నాయి. ఒకినావా ఆటోటెక్​ సంస్థ.. ఇప్పటికే 3వేలకుపైగా యూనిట్లను వెనక్కి పిలిపించింది. ప్యూర్​ఈవీ సంస్థ సైతం 2వేలకుపైగా ఎలక్ట్రిక్​ వాహనాలను తిరిగి తీసేసుకుంది.

ఈ అగ్నిప్రమాదాలకు సంబంధించిన ఘటనలను ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. వీటిపై ఓ ప్యానెల్​ను ఏర్పాటు చేసిన దర్యాప్తు చేపట్టింది. నిర్లక్ష్యం వహిస్తే.. వాహన తయారీ సంస్థలు భారీ మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరికలు జారీ చేసింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్