Man Stabs Wife: నడిరోడ్డుపై భార్యను కత్తితో ఏడుసార్లు పొడిచి చంపిన భర్త.. ఆపకుండా కళ్లప్పగించి చూసిన జనాలు: వీడియో
Man Stabs Wife: భార్యను నడిరోడ్డుపై ఏడుసార్లు పొడిచాడు ఓ వ్యక్తి. అక్కడే ఉన్న ప్రజలు కిరాతకానికి పాల్పడుతున్న అతడిని అడ్డుకునేందుకు ముందుకు రాలేదు. తీవ్రంగా గాయపడిన ఆమె మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ బయటికి వచ్చింది.
Man Stabs Wife: జనాలు తిరుగుతున్న నడివీధిలో ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పలుమార్లు పొడిచాడు. అక్కడ ఉన్న ప్రజలు అతడిని అడ్డుకోకుండా వేడుక చూసినట్టు చూశారు. ఆమెను కాపాడేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. దీంతో భార్యపై అతడు దారుణంగా కత్తితో దాడి కొనసాగించాడు. తీవ్ర గాయాల పాలైన ఆమె మృతి చెందింది. తమిళనాడు (Tamil Nadu)లోని వెల్లూరు (Vellore)లో ఈ ఘటన జరిగింది. ఈ తతంగం మొత్తం సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయింది. వివరాలివే..
ఇదీ జరిగింది..
Vellore Stabbing: ఈ ఘటనలో బాధితురాలిని పునీతగా గుర్తించారు. పునీతను ఆమె భర్త జయశంకర్ నడిరోడ్డుపై సోమవారం కిరాతకంగా పొడిచాడు. రోడ్డుపై జనాలు చూస్తుండగానే కత్తితో ఏడుసార్లు దాడి చేశాడు. ఆ సమయంలో రోడ్డుపై నడుస్తున్న, వాహనాలపై వెళుతున్న జనాలు ఈ ఘటనను కళ్లప్పగించి చూశారు. ఎవరూ అతడిని అడ్డుకునేందుకు ముందుకు రాలేదు. తీవ్ర గాయాల పాలై కుప్పకూలిన తర్వాత పునీతను అంబూరు ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయలపాలైన ఆమె కన్నుమూశారు.
ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
పునీతను ఆమె భర్త కిరాతంగా కత్తితో పొడిచిన ఘటన మొత్తం సీసీ టీవీలో రికార్డ్ అయింది. ఇందుకు సంబంధించి వీడియో కూడా బయటికి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.