Murder for iPhone: ఐఫోన్‍కు డబ్బు చెల్లించలేక.. డెలివరీ బాయ్‍ను చంపేసిన యువకుడు!: పోలీసులు ఎలా కనిపెట్టారంటే..-man murders delivery boy for iphone cctv footage leads to arrest in karnataka hassan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Man Murders Delivery Boy For Iphone Cctv Footage Leads To Arrest In Karnataka Hassan

Murder for iPhone: ఐఫోన్‍కు డబ్బు చెల్లించలేక.. డెలివరీ బాయ్‍ను చంపేసిన యువకుడు!: పోలీసులు ఎలా కనిపెట్టారంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 19, 2023 07:46 PM IST

Murder for iPhone: ఐఫోన్ కోసం డెలివరీ బాయ్‍ను ఓ యువకుడు హత్య చేశాడు. ఆధారాలు లేకుండా మృతదేహాన్ని కాల్చివేశాడు. అయితే పోలీసులు ఈ విషయాన్ని కనిపెట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. కర్ణాటక (Karnataka)లోని హసన్ (Hassan)లో జరిగింది ఈ ఘటన.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Murder for iPhone: ఐఫోన్‍కు డబ్బు చెల్లించలేక ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా డెలివరీ బాయ్‍ను చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని కాల్చేశాడు. కర్ణాటక (Karnataka)లోని హసన్ (Hassan) జిల్లాలో ఈ ఘటన షాకింగ్ ఘటన జరిగింది. హత్య కేసు నుంచి తప్పించకునేందుకు ఆ డెలివరీ బాయ్ మృతదేహాన్ని మూడు రోజులు ఇంట్లోనే ఉంచుకొని ఆ తర్వాత బయటి ప్రదేశంలో నిందితుడు కాల్చేశాడని పోలీసులు వెల్లడించారు. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

ఐఫోన్ డెలివరీ కోసం వచ్చినప్పుడు..

Murder for iPhone: హసన్ జిల్లాలోని అరసికెరె పట్టణంలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని 20 ఏళ్ల హేమంత్ దత్‍గా పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 7వ తేదీన సెకండ్ హ్యాండ్ ఐఫోన్‍ను డెలివరీ చేసేందుకు ఓ డెలివరీ బాయ్ వచ్చాడు. అయితే ఆ సమయంలో ఐఫోన్ కోసం చెల్లించేందుకు డబ్బు లేకపోవటంతో దత్.. ఏకంగా ఆ డెలివరీ బాయ్‍ను కత్తితో పలుమార్లు పొడిచి చంపేశాడని పోలీసులు వెల్లడించారు.

డబ్బు తెస్తానని కత్తితో..

Murder for iPhone: ఐఫోన్ డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తిని హేమంత్ దత్ తన ఇంట్లోకి పిలిచాడు. లోపలికి వెళ్లి డబ్బు తీసుకొస్తానని చెప్పాడు. అయితే డబ్బుకు బదులుగా కత్తి పట్టుకొచ్చి డెలివరీ బాయ్‍ను పొడిచాడు. దీంతో ఆ డెలివరీ బాయ్ అక్కడికక్కడే చనిపోయాడు.

మూడు రోజుల తర్వాత కాల్చివేసి..

Murder for iPhone: డెలివరీ బాయ్ మృతదేహాన్ని హేమంత్ దత్ మూడు రోజుల పాటు తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఆ తర్వాత పట్టణ శివారు ప్రాంతంలోని అడవిలో పెట్రోల్ పేసి కాల్చివేశాడు. మృతదేహాన్ని మాయం చేశాడు. శవాన్ని ఓ పెద్ద గన్నీ బ్యాగ్‍లో పెట్టి తన బైక్‍పైనే కాల్చేసేందుకు తీసుకెళ్లాడు.

సీసీ టీవీ ఫుటేజ్‍తో..

Murder for iPhone: కొప్పల్ రైల్వే గేట్ సమీపంలో కాలిపోయన ఓ మృతదేహాన్ని పోలీసులు ఈనెల 11వ తేదీన గుర్తించారు. దీంతో మిస్సింగ్ కేసులను పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆ చుట్టుపక్కల సీసీ టీవీ ఫుటేజ్‍లను చూశారు. హేమంత్ దత్.. పెట్రోల్‍ను క్యాన్‍లో తీసుకెళ్లడం, అతడి బైక్‍పై గన్నీ బ్యాగ్‍ అనుమానాస్పదంగా ఉండడాన్ని గమనించారు. దీంతో హసన్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ ఫుటేజ్ ఆధారంగా హేమంత్‍ దత్‍ను అదుపులోకి తీసుకొని విచారిస్తే విషయం బయటికి వచ్చింది. ఐఫోన్ కోసం డెలివరీ బాయ్‍ను హేమంత్ దత్ చంపినట్టు గుర్తించారు.

IPL_Entry_Point