Crime new : మటన్​ కొట్టులో మర్డర్​.. గొడవతో మొదలై హత్య వరకు..!-man murdered amid heated argument at meat shop at nagpur ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Man Murdered Amid Heated Argument At Meat Shop At Nagpur

Crime new : మటన్​ కొట్టులో మర్డర్​.. గొడవతో మొదలై హత్య వరకు..!

Sharath Chitturi HT Telugu
Oct 09, 2023 12:33 PM IST

Maharashtra crime news : మహారాష్ట్రలోని మాంసం దుకాణంలో దారుణ హత్య జరిగింది. ముగ్గురు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి, మరో వ్యక్తిని పదునైన ఆయుధంతో పొడిచి చంపేశాడు!

మటన్​ కొట్టులో మర్డర్​.. గొడవతో మొదలై హత్య వరకు..!
మటన్​ కొట్టులో మర్డర్​.. గొడవతో మొదలై హత్య వరకు..!

Maharashtra crime news : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మాంసం దుకాణంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

మహారాష్ట్ర నాగ్​పూర్​లోని సాయి నగర్​లో ఆదివారం జరిగింది ఈ ఘటన. మహేంద్ర రామ కోహ్లే అనే వ్యక్తి.. మటన్​ కొనుగోలు చేసేందుకు స్థానికంగా ఉన్న మాంసం దుకాణానికి వెళ్లాడు. అతనికి పరిచయం ఉన్న మరో వ్యక్తి అక్కడ కనిపించడంతో ఇద్దరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

Murder in meat shop : ఇంతలో.. ఆషిఖ్​ షేక్​ బాబు షేక్​ రెహ్మాన్​ అనే వ్యక్తి అక్కడికి వెళ్లాడు. అతని వయస్సు 22ఏళ్లు. ఎందుకో తెలియదు కానీ.. ఆ ఇద్దరిని చూసి, ఈ రెహ్మాన్​ కోపానికి గురయ్యాడు. వారిని తిట్టడం మొదలుపెట్టారు. వెనక్కి తగ్గని మహేంద్ర రామ కోహ్లే.. రెహ్మాన్​ను తిట్టడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలో రెహ్మాన్​ కోపం ఇంకా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అతనికి.. మటన్​ని కోసే పదునైన ఆయుధం కనిపించింది. దానిని చేతులోకి తీసుకుని, కోహ్లేపై దాడి చేశాడు రెహ్మాన్​. తల, ఛాతీ, మెడపై దాడి చేశాడు. ఈ క్రమంలో కోహ్లే తీవ్రంగా గాయపడ్డాడు. అతని శరీరం నుంచి ఎక్కువగా రక్తం పోయింది. అది చూసిన రెహ్మాన్​.. అక్కడి నుంచి పారిపోయాడు.

Nagpur crime latest news : బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కానీ మార్గం మధ్యలోనే అతను మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల వ్యవధిలోనే అతడిని పట్టుకున్నారు. త్వరలోనే అతడిని కోర్టులో హాజరుపరుస్తామని, బాధితుడి కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీనిచ్చారు.

WhatsApp channel

సంబంధిత కథనం